Jun 19, 2020, 5:04 PM IST
గ్రహాల ప్రభావం మనుషులపై ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎక్కువ గ్రహణాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రగ్రహణం రెండుసార్లు రాగా... ఈ ఆదివారం అంటే జూన్ 21న అతి పెద్ద సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనించదగిన విషయం. ఈ ప్రభావం భారత్, అమెరికాలపై తీవ్రంగా ఉండబోతోందని అంటున్నారు.