Apr 18, 2023, 4:18 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే కూలి పోవాలనేది కొంతమంది ఆలోచన అని మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ కుమార్ స్వామితో తనకు 2007 నుంచి పరిచయం ఉందని అన్నారు. ఎంతో మంది స్వామిజీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆశీర్వాదాలు ఇప్పిస్తుంటానని చెప్పారు. విజయ్ కుమార్ స్వామి గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయ్ కుమార్ స్వామి ఎవరి విమానంలో విజయవాడకు వచ్చారని ప్రశ్నించారు. విజయ్ కుమార్ స్వామి వచ్చిన విమానం రామోజీ బంధువేదనని అన్నారు. విజయ్ కుమార్ స్వామి అంటే అందరికి భక్తి భావమేనని అన్నారు. విజయ్ కుమార్ స్వామి వచ్చి సీఎం జగన్‌కు ఆశీర్వాదం అందించారని చెప్పారు. విజయ్ కుమార్ స్వామి లాబీయింగ్‌కు వచ్చారని దుష్ప్రచారం చెయ్యడం మంచిది కాదని అన్నారు. స్వామిజీలు, దేవుళ్ల విషయంలో నీచ రాజకీయాలు వద్దని హితవు పలికారు.