వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం... గడపగడపకు కార్యక్రమంలో నిలదీత

వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం... గడపగడపకు కార్యక్రమంలో నిలదీత

Published : Dec 21, 2022, 11:36 AM IST

గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు వైసిపి ప్రజాప్రతినిధులు ప్రజల తిరుగుబాటుకు గురవుతున్నారు.

గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు వైసిపి ప్రజాప్రతినిధులు ప్రజల తిరుగుబాటుకు గురవుతున్నారు. ఇలా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కొందరికి చేదు అనుభవాలు ఎదురవగా తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఉద్దండ్రాయునిపాలెం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్యెల్యే శ్రీదేవికి సొంత పార్టీ వారి నుండే వ్యతిరేకత ఎదురయ్యింది. వైసిపి పాలనలో వ్యక్తిగతంగా జరిగిన లబ్ది గురించి ఎమ్మెల్యే వివరిస్తుండగా ఇది సరే మరి నడవడానికి కూడా రాకుండా పాడయిపోయిన రోడ్లు వేయండి అని ఓ మహిళ ఎమ్మెల్యేను అడిగారు. పథకాలు ఇస్తున్నాం కదా... రోడ్డు తర్వాత చూద్దాం అంటూ ఎమ్మెల్యే మాట దాటవేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఇక స్థానిక రైతులు కూడా గత నాలుగేళ్లుగా తమకు ప్రభుత్వం నుండి కౌలు రావడంలేదని ఎమ్మెల్యే శ్రీదేవిని నిలదీసారు.  ముఖ్యంగా ఎస్సీ  రైతులకు కౌలు నిలిపివేసారని... ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్మస్ పండగ ఎలా ఆనందంగా జరుపుకుంటామంటూ అడిగారు. కౌలు రాకపోతే నేనేం చేయాలంటూ శ్రీదేవి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మా ఎమ్మెల్యే మిమ్మల్సి కాకుండా ఇంకెవరిని అడగాలంటూ బాధితులు ప్రశ్నించారు. 

03:36Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
09:48ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families
12:27మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం ఉండేది ఇంకా మూడేళ్లే:జగన్ | YS Jagan Visits Visakhapatnam
06:19విశాఖ పర్యటనలో జగన్ కోసం ఎగబడ్డ మహిళా అభిమానులు | YS Jagan Visits Visakhapatnam to Console Families
09:17ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families
33:42మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ ఎమోషనల్ | YS Jagan Visits Visakhapatnam to Console Families
31:11మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించిన జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Visits Visakhapatnam
10:57ప్ర‌భుత్వ దౌర్జ‌న్యాల‌ను చూస్తూ ఊరుకోము కూటమిపై రెచ్చిపోయిన అంబటి | Ambati Rambabu Press meet
16:43CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
19:38పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works
Read more