జేబ్రాండ్ మద్యాన్ని నిషేధించాలంటూ వరుసగా 5వ రోజు టీడీపీ ధర్నా

Mar 21, 2022, 10:59 AM IST

కల్తీ నాటు సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేబ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా అయిదో రోజూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిషేకం చేశారు. సీఎం ఫోటోపై మద్యం పోసి వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. కల్తీ నాటుసారాతో పాటు జె బ్రాండ్‌తో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని మండిపడ్డారు