ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఢీకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఢీకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎదుర్కునేందుకు అంగబలాలను ఆయన ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వారసత్వాన్ని స్వీకరించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు.