టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..

Bukka Sumabala   | Asianet News
Published : Jun 17, 2020, 10:34 AM IST

మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై విశాఖ జిల్లా పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై విశాఖ జిల్లా పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణవేణి మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు ఫోటో మున్సిపల్ కార్యాలయం నుంచి తొలగించారంటూ గవిరెడ్డి వెంకటరమణ సారధ్యంలో సోమవారం ఉదయం అనుమతి లేకుండా బహిరంగ సమావేశం నిర్వహించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమావేశంలోనే అయ్యన్నపాత్రుడు తనను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

03:58Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
07:25Nara Lokesh Speech: గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్
05:39Nara Lokesh: ఈ విద్యార్థి లైఫ్ లో జరిగిన ఘటనకి లోకేష్ ఎమోషనల్.. అందరిముందు క్లాప్స్ | Asianet Telugu
05:48లోకేష్ ముందు వెక్కి వెక్కిఏడ్చేసిన విద్యార్థిని Shining Stars Awards 2026 | Nara Lokesh
08:41ఏపీ మాక్ అసెంబ్లీ స్పీకర్ తో లోకేష్ పంచ్ లు Shining Stars Awards 2026 | Nara Lokesh | Asianet Telugu
06:01Nara Lokesh: సార్ అని పిలిస్తే చాక్లెట్ ఇవ్వాలి.. విద్యార్థులతో నారా లోకేష్ పంచ్ లు | Asianet Telugu
07:13తెలంగాణలో ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్ ఏపీలోనూ జోరువానలు | Heavy Rain Alert in Telangana & AP
08:14ఒక టీచర్ వల్లనే నేను ఈస్థాయికి వచ్చాను.. | Nara Lokesh Honors Best SSC & Inter Students in AP
18:24ఒక్కరైనా రాజకీయాల్లోకి రావాలి | Nara Lokesh Felicitates AP SSC & Inter Shining Stars| Asianet Telugu
03:20విద్యార్థిని ప్రశ్నకి పడిపడి నవ్విన మంత్రి లోకేష్ | Shining Stars Awards 2026 | Nara Lokesh