పార్వతీపురం మన్యం జిల్లాలో నాటుసారా తయారీ ముఠా రెచ్చిపోయింది. నాటుసారా తయారీపై సమాచారం అందడంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులపై దాడికి తెగబడ్డారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో నాటుసారా తయారీ ముఠా రెచ్చిపోయింది. నాటుసారా తయారీపై సమాచారం అందడంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులపై దాడికి తెగబడ్డారు. దీంతో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. బత్తిలి మండలం సతివాడ పంచాయితీ కొత్తగూడ గ్రామ సమీపంలో నాటుసారా తయారీ కేంద్రంపై స్థానిక ఎక్సైజ్ పోలీసులు దాడి చేసారు. అయితే నాటుసారా ముఠా పోలీసులపైకే తిరగబడి కర్రలతో దాడికి దిగారు. గ్రామస్తులంతా నాటుసారా ముఠాకే మద్దతుగా నిలవడంతో పోలీసులను ఏం చేయలేకపోయారు. నాటుసారా ముఠా దాడిలో బత్తిలి ఎస్సై సీతారాం, కానిస్టేబుల్ నవీన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇద్దరు పోలీసులను పాలకొండ హాస్పిటల్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఘటనను సీరియస్ గా తీసుకుని వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.