Mar 22, 2023, 10:50 AM IST
గుంటూరు : భారత రాష్ట్ర సమితి పార్టీకే తాను మద్దతిస్తున్నట్లు ప్రముఖ సినీనటుడు సుమన్ స్పష్టం చేసారు. తెలంగాణలో ఐటీ రంగం రోజురోజుకూ మరింత అభివృద్ది చెందుతూ బెంగళూరును సైతం వెనక్కినెట్టి ప్రపంచ స్థాయికి చేరుకుందని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది దిశగా దూసుకుపోతోందని హీరో సుమన్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆల్ ఇండియన్ సుమన్ యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటుచేసిన 2023 సంవత్సర క్యాలెండర్ ను సుమన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మట్లాడారు.సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత అభిమానులు ఎవరికి ఉండరని... అది ఆయన అదృష్టం అన్నారు. కానీ రాజకీయగా పవన్ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని సుమన్ అన్నారు.