కేసీఆర్ జాతీయ పార్టీలో ఏపీ నుండి మద్దతు... సివైఎఫ్ కీలక తీర్మానం

కేసీఆర్ జాతీయ పార్టీలో ఏపీ నుండి మద్దతు... సివైఎఫ్ కీలక తీర్మానం

Published : Oct 04, 2022, 04:13 PM IST

కాకినాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతివ్వనున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ రెవరెండ్ మూర్తి రాజు ప్రకటించారు.

కాకినాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతివ్వనున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ రెవరెండ్ మూర్తి రాజు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ పట్టణంలో జరిగిన క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సమావేశంలో ఈ కీలక ప్రకటన చేసారు. నిన్న(సోమవారం) జరిగిన సీవైఎఫ్ బోర్డ్ మీటింగ్ లో కేసీఆర్ పెట్టే జాతీయపార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు మూర్తి రాజు ప్రకటించారు. అసాధ్యమనేది లేకుండా అద్భుతాలు చేసే దేవుడు కేసీఆర్ కోరికను నెరవేర్చాలని సివైఎఫ్ కోరుకుంటోందని మూర్తి రాజు తెలిపారు. నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కోరుకున్న సమైక్యత, సమానత్వం గురించి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని అన్నారు. అంబేద్కర్ అందరికీ మత, వాక్కు స్వేచ్చ అందిస్తే వీటిని కొన్నిపార్టీలు హరిస్తున్నాయి... అలాంటి వారికి మేల్కొల్పడానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని అన్నారు. ఆయన కోరికను నెరవేర్చి... ఆలోచనలు సపలం అయ్యేలా చూడాలని కోరారు. కుల, మత ప్రసక్తి లేకుండా చూస్తూ మైనారిటీలకు అండగా వుండాలనే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని... ఆయనను ఆశీర్వదించాలి ప్రభువును కోరుకుంటున్నానని మూర్తి రాజు పేర్కొన్నారు. 

05:37ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్| Akiveedu Rama Temple Construction | RRR
03:34తెలుగు ప్రజలారా బిఅలర్ట్..ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం | Asianet News Telugu
03:11Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu
03:34Heavy Rain Alert in AP & Telangana | తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
16:38Gouthu Shireesha: పలాసలో ఏం జరుగుతోంది? సీదిరి అప్పల్రాజు అరెస్టుపై గౌతు శిరీష సంచలన కామెంట్స్
03:02ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే.. సర్వం సిద్ధమైన భోగాపురం ఎయిర్ పోర్టు | Bhogapuram Airport Opening
02:15Seediri Appalraju Wife: నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదు.. పోలీసులపై సీదిరి భార్య ఫైర్
05:07Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాన ఈ జిల్లాలకు హెచ్చరిక ఉరుములు, పిడుగులతో జాగ్రత్త
13:31సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu
18:35కాలువ అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్న JC Prabhakar Reddy Open Challenge