నడిరోడ్డుపై వాహనాన్ని అడ్డుకుని... ఫైన్సాన్స్ రికవరి ఏజెంట్స్ దౌర్జన్యం చూడండి...

నడిరోడ్డుపై వాహనాన్ని అడ్డుకుని... ఫైన్సాన్స్ రికవరి ఏజెంట్స్ దౌర్జన్యం చూడండి...

Published : Aug 24, 2022, 02:38 PM IST


విజయవాడ : ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల తాళలేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. 


విజయవాడ : ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థల వేధింపుల తాళలేక ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికి పలు ఫైనాన్స్ సంస్థలు తీరుమార్చుకోకుండా వేధింపులు కొనసాగిస్తునే వున్నాయి. వీరిని చూసి స్పూర్తిపొందారో ఏమో వెహికిల్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఇదే బాటపట్టాయి. వాహనాల కొనుగోలు సమయంలో తమవద్దే ఫైనాన్స్ తీసుకోవాలంటూ వెంటబడే సంస్ధలు ఆర్థిక సమస్యలతో నెలనెలా ఈఎంఐ సమయానికి కట్టలేకపోయేవారితో చాలా అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఓ రాష్ట్రం కాని రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబం ఫైనాన్స్ సంస్థ వేధింపులకు గురయ్యింది. 

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగచెర్ల మండలంలోని ఓ తండాకి చెందిన రాజేష్ ఖమ్మంలోని ఫైనాన్స్ సంస్థ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేసాడు. కొన్ని నెలవారి వాయిదాలను సరిగ్గానే కట్టినా ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా ఈఎంఐ కట్టలేకపోయాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా ఫైనాన్స్ సంస్థ రికవరీ ఏజెంట్లు అడ్డుకున్నారు. పెండింగ్ ఈఎంఐ మొత్తాన్ని కడితేనే వాహనాన్ని తీసుకెళ్లాలని... లేదంటే స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. దీంతో రాజేష్ తో పాటు అతడి కుటుంబసభ్యులు కంగారుపడిపోయి రోడ్డుపైనే రూ.30వేలు చెల్లించాల్సి వచ్చింది. కుటుంబసభ్యులంతా వాహనంలో వుండగా ఇలా ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు దురుసుగా వ్యవహరించడంపై రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 
 

62:11Nara Lokesh: అమ్మానాన్న వాలీబాల్ ప్లేయర్స్ అలా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టా | Asianet News Telugu
68:25తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్| Asianet News Telugu
08:58Nara Lokesh in Tirupati: తిరుపతిలో నారాలోకేష్ ఎంట్రీతో అభిమానుల్లో ఉరకలేసిన ఉత్సాహం| Asianet Telugu
05:43అంతర్జాతీయ బ్యాట్మింటన్ ప్లేయర్ పివి సింధుని ఓడించిన మంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
02:33CM Chandrababu Launches Anna Canteen:అన్నా క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించిన సీఎం| Asianet Telugu
02:56తిరుపతిలో నారాలోకేష్ క్రేజ్ చూశారా Naralokesh Launches Sports Facilities in Tirupati| Asianet Telugu
05:02క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ లోపల ఎలా ఉంటుందో చూశారా? | Chandrababu Launches Quantum | Asianet Telugu
27:37YS Jagan Visits Juvvaladinne: జగన్ పవర్ ఫుల్ స్పీచ్ కి దద్దరిల్లిన జువ్వలదిన్నె| Asianet News Telugu
12:08చంద్రబాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ | YS Jagan Visits Juvvaladinne | Asianet News Telugu
07:19వైసీపీకి షాక్‌.. జగన్‌ సీపీఆర్వో అరెస్టు | YS Jagan CPRO Arrest | YSRCP | Asianet News Telugu