గ్రామాల్లోనూ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు... నడిరోడ్డుపై మహిళ మెడలోంచి బంగారం చోరీ

గ్రామాల్లోనూ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు... నడిరోడ్డుపై మహిళ మెడలోంచి బంగారం చోరీ

Published : Dec 19, 2022, 12:24 PM IST

పామర్రు : కృష్ణా జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 

పామర్రు : కృష్ణా జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కిరాణా షాప్ నిర్వహించే ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసులను ఇద్దరు దుండగులు లాక్కుని పరారయ్యారు. పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందిన మాలికాదేవి రాత్రి కిరాణా షాప్ మూసి బైక్ పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగులు ముసుగులు ధరించి బైక్ పై ఆమెను అనుసరించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ వేగం తగ్గగానే ఒక్కసారిగా దగ్గరకు వచ్చిన దుండగులు మెడలోని రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు వెంటపడినా దొరక్కుండా తప్పించుకోవడంతో బాధిత మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది. 9 కాసుల బంగారు గొలుసులను దొంగిలించారన్న మాలికాదేవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ చైన్ స్నాచింగ్ కురుమద్దాలి గ్రామంలో కలకలం రేపింది. 
 

21:40రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli
10:39సినిమా రేంజ్ లో జగన్‌ మాస్ ఎంట్రీ | YS Jagan Visits Devarapalli Tobacco Procurement Centre
06:10ప్రశ్నిస్తే అక్రమ కేసులు అక్రమ అరెస్ట్ లు: జగన్‌ | YS Jagan Pressmeet Devarapalli
03:01జగన్ హెలికాప్టర్ చుట్టుముట్టిన జనం | YS Jagan Devarapalli Tour | Asianet News Telugu
13:27Pushpa Srivani Pressmeet: మంత్రి గుమ్మడి సంధ్యారాణికి శాఖపైకనీస అవగాహన లేదు
03:35Bhogapuram Airport ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు ఎమోషనల్ | Asianet News Telugu
27:28భోగాపురం ఎయిర్ పోర్ట్ లోపల ఎలా ఉందో చూడండి | Inside Bhogapuram International Airport
714:59కళ్ళు చెదిరే హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం | PM Modi to Inaugurate Bhogapuram Airport
05:22భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu
03:27ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. రెండున్నర గంటలపాటు భోగాపురంలో మోదీ | Asianet News Telugu