నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసుల యూనిఫాం కొలతలు మగ పోలీసులు, మగ టైలర్లు తీసుకోవడాన్ని భారతీయ జనతా మహిళా మోర్చా ఖండించింది.
నెల్లూరు జిల్లాలో మహిళా పోలీసుల యూనిఫాం కొలతలు మగ పోలీసులు, మగ టైలర్లు తీసుకోవడాన్ని భారతీయ జనతా మహిళా మోర్చా ఖండించింది. ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటన కౌరవ సభలో దుశ్శాసన పర్వాన్ని తలపిస్తోంది మహిళా మోర్చా పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించి భారతీయ జనతా మహిళా మోర్చా తరపున జాతీయ మహిళా కమిషన్ కు రిప్రజంటేసన్ మెయిల్ ద్వారా పంపించడం జరిగిందని తెలిపారు. నిన్నటి సంఘటనకు సంబంధించి బాధ్యులను విధులు నుండి తొలగించాలని తొలగించాలని మహిళా మోర్చా డిమాండ్ చేసింది.