ట్రైన్ జర్నీ చేసే వారందరి దగ్గర కచ్చితంగా ఉండాల్సిన నంబర్ ఇది

By Naga Surya Phani Kumar  |  First Published Dec 28, 2024, 2:32 PM IST

ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? అనవసరంగా గొడవ పడటం, అసహ్యంగా ప్రవర్తించడం లాంటివి చేశారా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ట్రైన్ ఆగే దాకా వెయిట్ చేయక్కరలేదు. ఒక్క మెసేజ్ పెడితే పోలీసులే మీ సీట్ దగ్గరకు వచ్చి మీకు సాయం చేస్తారు. మరి ఆ నంబర్ ఏంటి? ఆ నంబర్ ద్వారా ఎలాంటి ఇతర సేవలు పొందవచ్చు తదితర విషయాలు తెలుసుకుందాం రండి.
 


ట్రైన్ జర్నీని చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా ట్రైన్ లో ప్రయాణించడానికే ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఫుడ్ దొరుకుతుంది. హాయిగా పడుకొని ట్రావెల్ చేయొచ్చు. వాష్ రూమ్ ప్రాబ్లమ్ ఉండదు. ఇలా ఎన్నో సౌకర్యాలు ట్రైన్ జర్నీలో పొందవచ్చు. ఇవన్నీ చాలా తక్కువ టికెట్ ధరకే పొందొచ్చు. 

అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవేంటంటే..

Latest Videos

undefined

మనం రిజర్వ్ చేసుకున్న సీట్లో ఎవరో కూర్చొని ఉంటారు. ఇది మేము రిజర్వ్ చేసుకున్న సీటు.. లేవండి అన్నా వినరు. పైగా మనతోనే గొడవ పెట్టుకుంటారు. ఫైనల్ గా టీటీఈ గాని, సెక్యూరిటీ పోలీసులు గాని వచ్చి చెబితే గాని వినరు. ఇంత జరిగినా మనమేదో అన్యాయం చేశామన్నట్లుగా చూస్తారు.

కొందరు ఆకతాయిలు, మందు తాగే బ్యాచ్ ఉంటారు. వాళ్లు ట్రైన్ ఎక్కి అమ్మాయిలు, ఆడవాళ్లను ఏడిపించడమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్లతో ఎప్పుడూ ఇబ్బందే. వారిని ఆపడానికి ప్రయత్నిస్తే వారితో కూడా గొడవ పెట్టుకుంటారు. 

ఇలాంటి సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఒక రైల్వే నంబర్ ఉంది. ఆ నంబర్ కు వాట్సాప్ ద్వారా Hi అని మెసేజ్ పెడితే చాలు. పోలీసులు గాని, రైల్వే ప్రొటెక్షన్ టీమ్ గాని మీరున్న సీట్ దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఆ నంబర్ ఏంటంటే.. 9881193322.

ఈ నంబర్ కి వాట్సాప్ ద్వారా Hi అని మెసేజ్ పెడితే వెంటనే మీకు ట్రైన్ లో లభించే సర్వీసులు తెలుపుతూ ఒక రిప్లై మెసేజ్ వస్తుంది. అందులో చివరి సర్వీస్ అయిన Complaint inside Train ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్ తెలియజేస్తూ కంప్లయింట్ చేస్తే వెంటనే రైల్వే సిబ్బంది నుంచి సాయం అందుతుంది. 

9881193322 నంబరు ద్వారా కేవలం కంప్లయిట్ మాత్రమే కాకుండా మరిన్ని సేవలను పొందొచ్చు. అవేంటంటే..

1. PNR స్టేటస్ తెలుసుకోవచ్చు. 
2. ట్రైన్ లో ఉండే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. 
3. ప్రస్తుతం మీరు ప్రయాణిస్తున్న ట్రైన్ ఎక్కడ, ఏ స్టేషన్ కి దగ్గర్లో ఉందో తెలుసుకోవచ్చు. 
4. రిటర్న్ టికెట్ కూడా ట్రైన్ లో ఉండే బుక్ చేసుకోవచ్చు. 
5. అదేవిధంగా ట్రైన్ షెడ్యూల్ కూడా తెలుసుకోవచ్చు. ఏ టైమ్ కి ఏ స్టేషన్ కి చేరుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. 
6. ఈ నంబర్ ద్వారా కోచ్ పొజిషన్ కూడా తెలుసుకోవచ్చు. ఏ బోగీ ఏ ప్లేస్ లో ఉంది. వచ్చే స్టేషన్ లో ఏ ప్లాట్ ఫారమ్ పై ట్రైన్ ఆగుతుంది. 
ఇలాంటి ఎన్నో వివరాలు ఈ ఒక్క నంబర్ ద్వారా మీరు పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ నంబర్ ని సేవ్ చేసుకొని మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. 

click me!