సానియా మీర్జా డైటింగ్ కష్టాలు... ఫన్నీ వీడియో..!

By telugu news team  |  First Published Sep 5, 2022, 9:41 AM IST

తన ఫోటోలు, తన కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.  అంతేకాదు.. తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు. కాగా.. తాజాగా ఆమె తన డైటింగ్ కష్టాలను ఫన్నీగా షేర్ చేశారు.


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.  ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పర్సనల్ జీవితానికి సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. తన ఫోటోలు, తన కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.  అంతేకాదు.. తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు. కాగా.. తాజాగా ఆమె తన డైటింగ్ కష్టాలను ఫన్నీగా షేర్ చేశారు.

డైటింగ్ చేస్తున్న సమయంలోనే అస్సలు తినకూడాని కొన్ని ఫుడ్స్ గుర్తుకు వస్తాయి అంటూ ఆమె సరదాగా వీడియో షేర్ చేశారు.  ఆ వీడియోలో ఆమె సాధారణ టీ షర్ట్ ధరించి ఉన్నారు. కాగా.. ఓ హిందీ సాంగ్ కి లిప్ సింక్ ఇస్తూ ఈ వీడియో షేర్ చేయడం గమనార్హం. ఫిర్ హేరా ఫేరీలోని హిమేష్ రేషమియా  పాపులర్ పాట ముజ్కో యాద్ సతాయే తేరీ పాటకి ఆమె పెదవి సింక్ చేసింది. డైటింగ్ ని డిస్టర్బ్ చేసే ఫుడ్స్ గుర్తుకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆమె ఆ రీల్ చేయడం గమనార్హం.

Latest Videos

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. కొందరేమో.. నీ బాధ నేను అర్థం చేసుకోగలనూ అంటూ కామెంట్ చేయగా... తాను ఉన్న పరిస్థితికి ఆ పాట కరెక్ట్ గా సెట్ అయ్యిందంటూ కొందరు మెసేజ్ చేయడం గమనార్హం. 
 

click me!