Rafael Nadal: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఇటీవల గాయాలతో సావాసం చేస్తున్నాడు. వరుస టోర్నీలలో గాయపడుతున్నా నాదల్ మాత్రం రఫ్ఫాడిస్తున్నాడు.
కాస్త విరామం తర్వాత యూఎస్ ఓపెన్ ఆడుతున్న టెన్నిస్ స్టార్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మళ్లీ గాయపడ్డాడు. ఇటీవల కొద్దిరోజుల క్రితం వింబూల్డన్ ఆడుతూ సెమీస్ లో గాయంతో వెనుదిరిగిన నాదల్.. తాజాగా యూఎస్ ఓపెన్ లో కూడా గాయపడ్డాడు. అయితే ఈసారి గాయం ప్రమాదవశాత్తూ జరిగింది కాదు.. తనకు తాను చేసుకున్నది. యూఎస్ ఓపెన్ లో భాగంగా రెండో రౌండ్ లో ఫాబియో ఫోగ్నినితో మ్యాచ్ ఆడుతున్న క్రమంలో నాదల్ గాయపడ్డాడు.
రెండో రౌండ్ మ్యాచ్ లో భాగంగా నాదల్ తొలి సెట్ ను 2-6తో ఓడిపోయాడు. అయితే ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు. వరుసగా రెండు సెట్లు నెగ్గి మ్యాచ్ లో ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. నాలుగో సెట్ ఆడుతుండగా.. ప్రత్యర్థి వైపు బలమైన షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు తన రాకెట్ నాదల్ ముక్కుకు బలంగా తాకింది.
undefined
దీంతో బంతిని కూడా చూసుకోకుండా నాదల్ అక్కడే రాకెట్ ను కింద పడేసి కోర్టు బయటకు వెళ్లి అక్కడే పడిపోయాడు. ఆ సమయంలో నాదల్ ముక్కు నుంచి రక్తం కారడంతో వైద్య సిబ్బంది అతడికి ప్రాథమిక వైద్యం అందించారు. ఒకవైపు నొప్పి వేధిస్తున్నా నాదల్ మాత్రం ఆట మీదే దృష్టి పెట్ట చివరి సెట్ ను 6-1తో గెలుచుకున్నాడు. దీంతో ఫోగ్నిని పై 2-6, 6-4, 6-2, 6-1 తో విజయం సాధించి మూడో రౌండ్ కు దూసుకెళ్లాడు.
Nadal hit by the racket in the nose pic.twitter.com/RNGVedzzu1
— Aria (@ariaischic)మ్కాచ్ అనంతరం నాదల్ స్పందిస్తూ.. నొప్పి కొంచెం వేధించిందని చెప్పాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా..? అని అడగగా.. గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఇలా అయిందని, టెన్నిస్ రాకెట్ తో ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చాడు.
We're glad you are ok, 🙏 pic.twitter.com/t9hzv1QNMH
— US Open Tennis (@usopen)