కొడుకుతో సానియా ట్విన్నింగ్.. ఫోటోలు వైరల్

Published : Dec 04, 2020, 08:45 AM IST
కొడుకుతో సానియా  ట్విన్నింగ్.. ఫోటోలు వైరల్

సారాంశం

 పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని సానియా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత సానియా దాదాపు 23కిలోల బరుతు తగ్గారు.

భారత టెన్నిస్ క్రీడాకారిణని సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జాతో కలిసి సమయం గుడుపుతున్నారు. తన ముద్దుల కుమారుడిని చూసి ఆమె మురిసిపోతున్నారు. ఆడుతూ పాడుతూ.. సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. కాగా.. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం టెన్నిస్ టోర్నీల్లో సానియా ఎక్కువగా పాల్గొనడం లేదు. దీంతో ఆ సమయాన్ని కొడుకు కోసం వెచ్చిస్తున్నారు. కాగా.. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని సానియా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత సానియా దాదాపు 23కిలోల బరుతు తగ్గారు.

 

ఎన్నో కష్టమైన కసరత్తులు చేసి.. కఠినమైన ఆహారపు నిబంధనలు పాటించి మరీ బరువు కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. మొదట్లో టెన్నిస్ ఆడతానని అనుకోలేదని.. అయితే.. తనకిష్టమైన ఆట కోసం శ్రమించి బరువు తగ్గానని ఆమె చెప్పడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత