Novak Djokovic In Aus Open: ప్రస్తుతం ఇమిగ్రేషన్ మినిస్టర్ తో పాటు ఆ శాఖకు చెందిన అధికారులు జొకో సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు గురువారం విడుదల చేసిన ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా లో అతడి పేరు కూడా ఉంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి వచ్చిన ప్రపంచ టెన్నిస్ స్టార్, టాప్ సీడ్ నోవాక్ జొకోవిచ్ పై ఇంకా ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకముందే.. టోర్నీలో మాత్రం అతడి పేరును చేర్చారు నిర్వాహకులు. గురువారం విడుదలైన ఆస్ట్రేలియన్ ఓపెన్ డ్రా లో జొకోవిచ్ కు స్థానం కల్పించారు. తొలి రౌండ్ లో అతడు.. సెర్బియాకే చెందిన మియోమిర్ కెక్మనోవిచ్ తో తలపడనున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు.
కరోనా వచ్చిన తర్వాత క్వారంటైన్ నిబంధనలను పాటించకపోవడమే గాక వ్యాక్సినేషన్ కూడా వేయించుకోకుండా ఆస్ట్రేలియా వచ్చిన అతడిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తున్నది. గతనెలలో ఈ సెర్బియా స్టార్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జొకోవిచ్ తప్పు ఒప్పుకున్నాడు.
undefined
అది తప్పే : జొకోవిచ్
కొవిడ్-19 సోకినా స్వీయ నిర్బంధంలో ఉండకుండా పలు కార్యక్రమాల్లో పాటించడం ద్వారా తాను తప్పు చేశానని జొకోవిచ్ అంగీకరించాడు. దానిని తన బృందంలోని ఓ సభ్యుడు చేసిన ‘మానవ తప్పిదం’గా అభివర్ణించినట్టు సమాచారం. ‘మహమ్మారి ప్రపంచానికి సవాలు విసరుతున్న కాలంలో మనం జీవిస్తున్నాము. కొన్నిసార్లు ఈ తప్పులు సంభవించవచ్చు..’ అని జొకో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.
గతనెలలో జొకోకు కరోనా సోకింది. అయితే వ్యాక్సిన్ వేయించుకోవడానికి సమయం దొరకలేకపోవడంతోనే తాను ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నానని గతంలో జొకోవిచ్ చెప్పాడు. కానీ తాజాగా అతడి వ్యాఖ్యలు చూస్తుంటే జొకో కావాలనే అబద్దం చెప్పాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకా ఎటూ తేల్చని ఆస్ట్రేలియా :
ఇదిలాఉండగా.. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ జొకోకు టాప్ సీడింగ్ కేటాయించడమే గాక ఏకంగా పోటీలకు షెడ్యూల్ ను కూడా ఫిక్స్ చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వమేమో అతడి వీసాకు సంబంధించిన అంశంపై ఇంకా ఎటూ తేల్చలేదు. వీసా విషయమై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పోరాడి న్యాయస్థానంలో గెలిచిన జొకోను ప్రభుత్వం మాత్రం విడిచిపెట్టడం లేదు. అతడింకా పోలీసుల కస్టడీలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక జొకో.. వీసా అంశంపై మాట్లాడటానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ను పాత్రికేయులు ప్రశ్నించగా అతడు మౌనాన్ని ఆశ్రయించాడు. దానిపై ఇమిగ్రేషన్ మంత్రి అలెక్స్ హక్ నిర్ణయం తీసుకుంటాడని సమాధానం దాటవేశాడు. ప్రస్తుతం ఇమిగ్రేషన్ మినిస్టర్ తో పాటు ఆ శాఖకు చెందిన అధికారులు జొకో సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. అందులో ఏదైనా తప్పుగా తేలితే మాత్రం జొకోకు భారీ షాక్ ఇవ్వడానికి కూడా కంగారూ ప్రభుత్వం వెనుకాడటం లేదు. జొకో అంశంపై శుక్రవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
అచ్చొచ్చిన వేదికపై అదరగొట్టేందుకు :
Top seed and nine-time champion 🇷🇸 begins his title defence against Miomir Kecmanovic. pic.twitter.com/96MAlHNElG
— #AusOpen (@AustralianOpen)ఇప్పటివరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జొకోవిచ్ ఆధిక్యం కొనసాగించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 9 టైటిల్స్ నెగ్గిన ఈ సెర్బియా స్టార్.. పదో ట్రీఫీని కూడా నెగ్గి మొత్తం 21 గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన ఆటగాడిగా రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ల సరసన నిలవాలని ఆరాటపడుతున్నాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జొకోకు అవకాశం వచ్చినా అతడు ఏ మేర రాణిస్తాడనేది అనుమానంగానే ఉంది.