నోవాక్ జొకోవిచ్ కు ఆస్ట్రేలియా షాక్.. ఎంట్రీ వీసా రద్దు.. విమానాశ్రయంలోనే నిలిపివేత..

By SumaBala Bukka  |  First Published Jan 6, 2022, 8:57 AM IST

ఒక్క డోసూ తీసుకోకపోయినా.. ఆరంభ గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు జోకోవిచ్. టోర్నీ నిర్వాహకులు ఇందుకు అనుమతి కూడా మంజూరు చేశారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ -19 లాక్‌డౌన్‌లు, కరోనా ఆంక్షలను భరించిన ఆస్ట్రేలియన్లలో..  అతని దరఖాస్తును రెండు మెడికల్ ప్యానెల్లు క్లియర్ చేయడం, ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు మంజూరు చేసిన వ్యాక్సిన్ మినహాయింపులు.. విపరీతమైన కోపాన్ని రేకెత్తించాయి.


novak djokovic ఎంట్రీ వీసాను రద్దు చేసినట్లు Australia గురువారం ప్రకటించింది. దీంతో Australian Open Grand Slam టెన్నిస్ టోర్నీలో టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రత్యేక వైద్య మినహాయింపుతో ఇక్కడికి వచ్చిన Defending champion, ప్రపంచ నంబర్ వన్ జొకోవిచ్ కు ఊహించని షాక్ ఎదురయ్యింది. దీనికి ముందు Corona virus vaccination రెండు డోసులు వేసుకోకున్నా.. టోర్నమెంట్‌లో ఆడేందుకు తనకు వైద్యపరమైన Exception ఉందని సోషల్ మీడియాలో సంబరాలు చేసుకున్నాడు జోకోవిచ్. ఆ తర్వాత సెర్బ్ బుధవారం సాయంత్రం మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టాడు. 

ఒక్క డోసూ తీసుకోకపోయినా.. ఆరంభ గ్రాండ్ స్లామ్ ఆడేందుకు మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు జోకోవిచ్. టోర్నీ నిర్వాహకులు ఇందుకు అనుమతి కూడా మంజూరు చేశారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ -19 లాక్‌డౌన్‌లు, కరోనా ఆంక్షలను భరించిన ఆస్ట్రేలియన్లలో..  అతని దరఖాస్తును రెండు మెడికల్ ప్యానెల్లు క్లియర్ చేయడం, ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు మంజూరు చేసిన వ్యాక్సిన్ మినహాయింపులు.. విపరీతమైన కోపాన్ని రేకెత్తించాయి.

Latest Videos

undefined

తొమ్మిది సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌ గెలుచుకున్న జొకోవిచ్ ఎప్పుడూ సరిహద్దు నియంత్రణను దాటలేదు. అయితే మినహాయింపు కోసం అతను జతచేసిన ధృవపత్రాల్లో సహేతుక కారణాలు ఉండాల్సిందే. ఆస్ట్రేలియా వీసా కోసం ఇవన్నీ స్క్రూటినీ చేశాకే వీసా మంజూరు చేశారు. అయితే  "జొకోవిచ్ ఆస్ట్రేలియాలోకి ఎంట్నీకి అవసరమైన తగిన సాక్ష్యాలను అందించడంలో విఫలమయ్యాడు.అతని వీసా తరువాత రద్దు చేయబడింది" అని ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతేకాదు.. ఎంట్రీ సమయంలో ఎక్స్ పైర్ అయిన వీసా ఉన్నవాళ్లు, వీసా రద్దు చేయబడిన వారు ఆస్ట్రేలియా నుంచి డిటైన్ చేయబడతారని, పంపించేయబడతారని వారు తెలిపారు. అందుకే ‘ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ మా సరిహద్దు వద్దకు వచ్చేవారు మా చట్టాలు, ప్రవేశ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది." అని తెలిపారు.

'క్షమాపణలు లేవు'..
ఈ అంశంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ కూడా స్పందించారు. టీకా తీసుకోకపోవడానికి గల సరైన కారణాలుంటేనే వీసాగానీ, ఆడనిచ్చేది గానీ జరుగుతుందని లేదంటే.. ఎంతవారైనా తిరుగు ప్రయాణం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో వైరస్ వ్యాప్తి, మరణాల రేటును కంట్రోల్ ఉంచడానికి కఠినమైన సరిహద్దు విధానాలు చాలా కీలకమైనవని అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ అన్నారు.

అంతేకాదు ‘ఈ నిబంధనలకు ఎవరూ అతీతులు కాదని.. దీనిమీద ప్రభుత్వం క్షమాపణలు చెప్పలేదు’ అని హోం వ్యవహారాల మంత్రి కరెన్ ఆండ్రూస్ అన్నారు. ‘కఠినంగా కనిపిస్తున్నా అందరూ ఈ నిబంధనలు పాటించాల్సిందే. వీటిని ఫాలో అవ్వని వ్యక్తులకు ఆస్ట్రేలియాలో ప్రవేశం నిరాకరించబడుతుంది, వారు ఎంత గొప్పవారైనా సరే" అని ఆమె ఒక ప్రకటనలో తెలిపింది.

వీసా రద్దు చేయబడడంతో మొదట జొకోవిచ్  ఆస్ట్రేలియా నుంచి వెనక్కి రావాలని భావించారు. అయితే ఇలా ఓ అంతర్జాతీయ ఆటగాడికి, స్టార్ ఆటగాడి పట్ల ఆస్ట్రేలియా అవమానకరరీతిలో వ్యవహరించడంపై సెర్బియా ప్రెసిడెంట్ విరుచుకుపడ్డాడు.

ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతూ..  తాను జొకోవిచ్‌తో ఫోన్‌లో మాట్లాడానని "మొత్తం సెర్బియా అతనికి తోడుగా ఉండని తెలిపానని.. ప్రపంచంలోని అత్యుత్తమ టెన్నిస్ ప్లేయర్‌పై ఈ విధమైన దుర్వినియోగం మీద తమ అధికారులు చర్యలు మొదలు పెట్టారని.. ఈ వివాదం త్వరగా ముగిసేలా మా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని" అతనికి చెప్పానని అన్నారు.

"అంతర్జాతీయ ప్రజా చట్టం ప్రమాణాలకు అనుగుణంగా, సెర్బియా నోవాక్ జకోవిచ్ కు న్యాయం జరిగేలా పోరాడుతుంది." అన్నారు. అయితే జొకోవిచ్‌కు మినహాయింపు ఇవ్వడంపై వెల్లువెత్తున్న ఆగ్రహం నేపథ్యంలోతద ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆస్ట్రేలియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ స్టీఫెన్ పర్నిస్ మాట్లాడుతూ, కోవిడ్ -19 వ్యాప్తిని ఆపడానికి ప్రయత్నిస్తున్న ప్రజలకు ఇది "భయంకరమైన సందేశం" పంపిందని.. అందుకే వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. 

ప్రత్యేకమైన ఆదరణ లేదు...
జొకోవిచ్ కరోనా వైరస్ టీకాలు వేసుకోవడంలో మినహాయింపుకు సంబంధించిన ఆధారాలు లేకుంటే అతను "తదుపరి విమానం ఇంటికి వెళ్తాడు" అని మోరిసన్ బుధవారం రోజు హెచ్చరించాడు.

కాగా, జనవరి 17న ప్రారంభమయ్యే 2022 ఫస్ట్ గ్రాండ్ స్లామ్‌లో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్-19టీకాలు వేసుకోవాలి. లేదా వైద్యపరమైన మినహాయింపును కలిగి ఉండాలి, ఈ మినహాయింపు స్వతంత్ర నిపుణులతో కూడిన రెండు ప్యానెల్‌ల ద్వారా అంచనా వేసిన తర్వాత మాత్రమే మంజూరు చేయబడుతుంది.

ISL 2021-22 : పాయింట్ల పట్టికలో తొలిసారి అగ్రస్థానంలోకి హెచ్‌ఎఫ్‌సీ

టోర్నమెంట్ చీఫ్ క్రెయిగ్ టైలీ మాట్లాడుతూ, డిఫెండింగ్ ఛాంపియన్‌ జొకోవిచ్ కు ఎలాంటి special favour లేదు. కానీ ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి అతనికి ఇలాంటి మినహాయింపు ఎందుకు వచ్చిందో చెప్పాలని కోరుతున్నాం అన్నారు. 

ఒక వ్యక్తి గత ఆరు నెలల్లో కరోనా బారిన పడితే వ్యాక్సిన్ లేకుండా ప్రవేశాన్ని అనుమతించవచ్చనేది షరతులలో ఒకటి... మరి జకోవిచ్ విషయంలో అలా జరిగిందా అనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇక టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే సుమారు 3,000 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో కేవలం 26 మంది మాత్రమే వ్యాక్సిన్ మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నారని టైలీ చెప్పారు. 

మినహాయింపు దరఖాస్తు ప్రక్రియ సమగ్రతను అతను సమర్థించాడు. "ఆ షరతులను సంబంధించిన అన్ని ఆధారాలు అందించిన అందరికీ ఎంట్రీ లభించింది. ఎవ్వరికీ స్పెషల్ ఫేవర్ లేదు. నోవాక్‌కు ప్రత్యేక అవకాశం ఇవ్వలేదు," అని టైలీ చెప్పారు.

ఏప్రిల్ 2020లో కోవిడ్-19 వ్యాక్సిన్‌పై జొకోవిచ్ తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు, "వ్యక్తిగతంగా నేను వ్యాక్సిన్లకు అనుకూలం కాదు" అని జకోవిచ్ ఆ సమయంలో చెప్పాడు. "ఎవరైనా నన్ను టీకాలు వేసుకోమని బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు." అని తెలిపాడు. 

click me!