గత సంవత్సరం యూఎస్ ఓపెన్ లో రోజెర్ ఫెదరర్ పై మ్యాచ్ ఆడి ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన సుమిత్ నాగల్ ఇప్పుడు కోచింగ్ కి అని వెళ్లి జర్మనీలో చిక్కుబడిపోయాడు. కరోనా లాక్ డౌన్ వేళ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్కడ నెట్టుకొస్తున్నాడు.
భారత టెన్నిస్ లో ఎదుగుతున్న ఒక వర్ధమాన క్రీడాజకారుడు సుమిత్ నాగల్. హర్యానా ఝాజ్ఝార్ కి చెందిన ఈ యువ కెరటం ఇప్పుడు జర్మనీలో కరోనా వేళ చిక్కుబడిపోయాడు.
గత సంవత్సరం యూఎస్ ఓపెన్ లో రోజెర్ ఫెదరర్ పై మ్యాచ్ ఆడి ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన సుమిత్ నాగల్ ఇప్పుడు కోచింగ్ కి అని వెళ్లి జర్మనీలో చిక్కుబడిపోయాడు. కరోనా లాక్ డౌన్ వేళ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్కడ నెట్టుకొస్తున్నాడు.
జర్మనీలోని ఒక రెసిడెన్షియల్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సుమిత్ నాగల్, కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడ చిక్కుబడిపోయాడు. సాధారణ కుటుంబం నుంచే వచ్చిన సుమిత్ ఇప్పుడు అక్కడ చాలా కష్టాలకోర్చి నెట్టుకొస్తున్నారు.
అక్కడ తన ఆరోగ్యం విషయంలో ఎటువంటి బాధ లేకున్నప్పటికీ... అక్కడ ఆ కుర్రాడు ఉండడానికి, తిండికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ప్రయాణాలప్పుడు హోటల్స్ లో బస చేయడం పూర్తిగా మానేసాడు. ప్రయాణాలకు విమానాల్లో ప్రయాణించడాన్ని పక్కకు పెట్టేసాడు.
దేశం కానీ దేశం, భాష రాని ప్రజలు అక్కడ చాలా కష్టాలకోర్చి నెట్టుకొస్తున్నానని, జీవితంలో కష్టాలు ఒక భాగమేనంటూ వేదాంతాలను కూడా ఈ కుర్రాడు వల్లెవేస్తున్నాడు. సాధారణంగా ఈ సమయంలో వీలైనన్ని టెన్నిస్ టోర్నీలు ఆడుతూ తన ర్యాంకును మెరుగుపరుచుకోవడంలో బిజీగా ఉండే ఈ ఆటగాడు ఇప్పుడు జర్మనీలో చిక్కుబడిపోయి ఉన్నాడు.
ఈ కరోనా వల్ల స్పోర్ట్స్ క్యాలెండర్ బాగా దెబ్బతినిందని, పరిస్థితి ఎప్పుడు మామూలు స్థితికి వస్తుందో చెప్పడం కష్టమని సుమిత్ అభిప్రాయపడ్డాడు. ఇలా ఇటు టోర్నీలు లేక, వేరే దేశంలో చిక్కుబడిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ లాక్ డౌన్ ఎప్పుడు అయిపోతుందో అర్థమవకుండా ఉందని సుమిత్ వ్యాఖ్యానించాడు.
ఇలా జర్మనీలో కష్టాలను అనుభవిస్తున్న సుమిత్ ను ఆదుకోవడానికి భారత టెన్నిస్ దిగ్గజాలంతా ముందుకొచ్చారు. మహేష్ భూపతి నుంచి సానియా మీర్జా వరకు ప్రతిఒక్కరు తలా ఒక చెయ్యివేస్తూ అక్కడ సుమిత్ ను ఆదుకుంటున్నారు.
ఈ విషయమై సానియా మీర్జా కూడా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మహేష్ భూపతి సైతం నాగల్ పరిస్థితిపై ఒక మీడియా సంస్థతో మాట్లాడాడు.