పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకని, తనలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించానని, ఒలింపిక్స్ వాయిదా దురదృష్టవశాత్తూ తనకు ప్రతికూలమే అని సానియా తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది.
చాలా కాలం తరువాత, తల్లి బాధ్యతలను నిర్వర్తిస్తూనే సానియా మీర్జా రాకెట్ పట్టి పునరాగమనం చేసింది. వచ్చి రావడంతోనే హోబర్ట్ ఇంటర్నేషనల్ సాధించి తన సత్త చాటింది. ప్రపంచ గ్రూప్స్ కు అర్హత సాధించి ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్నవేళ కరోనా మహమ్మారి రూపంలోప్ తన కెరీర్ పై పెద్ద బండరాయి పడినట్టు అనిపిస్తుందంటున్న భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మనోగతం.
తాను పునరాగమనం చేసిందే టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకని, తనలో ఆడగల సత్తా ఇంకా ఉంది కాబట్టే దాని గురించి ఆలోచించానని, ఒలింపిక్స్ వాయిదా దురదృష్టవశాత్తూ తనకు ప్రతికూలమే అని సానియా తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది.
2021 అంటే ఇంకా చాలా దూరం ఉందని, అత్యున్నత స్థాయిలో ఆట ఆడాలంటే దానికో ప్రక్రియ ఉంటుందని, దానికి సమయం పట్టడం సహజమని సానియా వ్యాఖ్యానించింది.
టోర్నీల్లో గెలుపోటములు ఉంటాయన్నా విషయం తనకు తెలుసునని, ఆ స్థాయిలో ఆడేందుకు, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే వచ్చానని, కానీ ఇప్పుడు అంతా మారిపోతుందని, ఆటలో లయ తప్పుతుంది కాబట్టి మళ్లీ చాలా కష్టపడాల్సి ఉంటుందని సానియా ఆవేదన వ్యక్తం చేసింది.
అంతా మంచిగా సాగితే మళ్లీ ఆడతానని, కానీ మరో పునరాగమనం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోననే భయంగా ఉందని తన మనసులోని ఆందోళనలను బయటపెట్టింది. సానియా ప్రస్తుత వయసు 33. 2021 ఒలింపిక్స్ నాటికి 35వ పడిలో నుంచి 36వ పదిలోకి అడుగుపెట్టేందుకు మరో మూడు నాలుగు నెలల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా తన వయసుకు సంబంధించి ఆందోళన చెందుతుంది.
కరోనా తీవ్రత తగ్గి ప్రపంచవ్యాప్తంగా క్రీడలు మొదలైనప్పటికీ.... ఆటలో పాత పద్ధతులకు బదులుగా అంతా కొత్త తరహా వాతావరణం కనిపిస్తుందని సానియా వ్యాఖ్యానించింది. ‘
ఖచ్చితంగా అంతా మారిపోతుందని, ఎంతగా అంటే సరిగ్గా చెప్పలేకపోవచ్చు కానీ... క్రీడలను అటుంచితే, సాధారణ జీవితం కూడా మారిపోవడం ఖాయమని సానియా అభిప్రాయూయపడింది. మనలో ప్రతీ ఒక్కరు మరొకరిని చూసి భయపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని, ఇప్పటికే చాలా మారిపోతోందని, ఎందరినో కలుస్తున్నా.... ఆత్మీయంగా ఆలింగనం చేసుకోలేకపోతున్నామని, క్రీడలు కూడా చాలా మారిపోతాయని సానియా మీర్జా వాఖ్యానించింది.
కరోనా కారణంగా ఇతర క్రీడలతో పోలిస్తే టెన్నిస్‌కు ఎక్కువ నష్టం జరుగుతోందని సానియా అభిప్రాయపడింది. ఇతర క్రీడలకన్నా టెన్నిస్ ఎందుకు నష్టపోతుందో సాదోహరణంగా వివరించింది కూడా!.
టెన్నిస్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో ఆడుతున్నారని, ఈ మహమ్మారి దెబ్బకు మరో దేశానికి ప్రయాణం చేయలేకపోతే టోర్నీలు జరగవని, ఇదే టెన్నిస్ కు ప్రధాన సమస్య అని సానియా తన ఆలోచనలను బయటపెట్టింది. రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్‌లో ఇది ఉండదని, భారత్‌లో, పక్కనే ఉన్న శ్రీలంకలో కరోనా ప్రభావం తగ్గిందంటే ఈ రెండు దేశాల మధ్య సిరీస్ నిర్వహించుకోవచ్చుని, కానీ టెన్నిస్‌లో మాత్రం అది సాధ్యం కాద కదా అంటూ సానియా క్రికెట్ ఉదాహరణతో విశ్లేషించింది.
మామూలు సమయాల్లో ఆట ఆడేటప్పుడు ప్రేక్షకుల అరుపులు, వారు చూపెట్టే అభిమానం ఆటపై మరింత ఫోకస్ పెట్టేందుకు పనిచేస్తాయని, ఆటలో అవి ఎనర్జీ బూస్టర్స్ అని, కానీ ప్రస్తుత తరుణంలో మాత్రం అభిమానులు లేకున్నా, కనీసం మ్యాచ్ లు జరిగితే చాలు అని అనుకోవాల్సి స్థితికి చేరుకోవాల్సి వచ్చిందని నిర్లిప్తతను వ్యక్తం చేసింది సానియా.
ఈ కరోనా వైరస్ వల్ల బయట పరిస్థితులు బాగాలేవని అందరం కూడా లాక్ డౌన్ వల్ల ఇండ్లకే పరిమితమయ్యామని. అన్ని సౌకర్యాలు ఉన్న మన పరిస్థితే ఇలా ఉంటె... ఏమి లేని వారి పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉందని సానియా మీర్జా అభిప్రాయపడింది.
తాను చేసిన మంచి పనుల గురించి తనకు చెప్పుకోవడం ఇష్టముండదని, గడిచిన నెల రోజుల్లో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలను సేకరించి ఎందరో పేదవారికి తిండి పెట్టామని సానియా తెలిపింది.