లాంగ్ గ్యాప్ తర్వాత: కుమారుడితో సానియా, ఫోటో వైరల్

Siva Kodati |  
Published : May 07, 2019, 10:28 AM IST
లాంగ్ గ్యాప్ తర్వాత: కుమారుడితో సానియా, ఫోటో వైరల్

సారాంశం

ఇప్పటి వరకు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ప్రపంచంలో క్రీడాకారిణిగా విజయాలను రుచి చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 

ఇప్పటి వరకు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ప్రపంచంలో క్రీడాకారిణిగా విజయాలను రుచి చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులకు ఓ బాబు జన్మించిన సంగతి తెలిసిందే.

అతనికి ఇజాన్ మీర్జా మాలిక్ అని నామకరణం చేశారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు అందరు సెలబ్రిటీల లాగానే సోషల్  మీడియా ద్వారా తమ గారాలపట్టిని పరిచయం చేస్తోందీ జంట.

తాజాగా సోమవారం సానియా మరో ఫోటోను షేర్ చేసింది. దీనికి చాలా అందమైన ఫోటో.. ప్రస్తుతం నువ్వు నాకు అందరికన్నా ఎక్కువ.. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ట్వీట్టర్‌లో పోస్ట్ చేసిన కాసేపటికే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కాగా, ప్రెగ్నెన్సి తర్వాత తాను మరోసారి రాకెట్ పట్టుకుంటానని ప్రకటించింది. 2020లో జరగనుపన్న టోక్యో ఒలింపిక్స్‌లో తాను బరిలోకి దిగుతానని సానియా తెలిపిన సంగతి తెలిసిందే.

గర్భందాల్చిన తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన సమయం రెండు వేరు వేరు అనుభూతులను ఇచ్చాయని ఆమె పేర్కొన్నారు. సెరెనా విలియమ్స్, కిమ్ క్లిజ్‌స్టర్స్‌‌లు అమ్మలైన తర్వాత కూడా ఎన్నో విజయాలు సాధించారని సానియా గుర్తు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత