జవాన్లకు సంతాపం, నెటిజన్లపై ఫైర్: ఉద్వేగంతో సానియా పోస్ట్

By Siva KodatiFirst Published Feb 18, 2019, 10:57 AM IST
Highlights

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో సానియా మీర్జాను నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేశారు. దీనికి కారణం ఆమె పాక్ జాతీయుడు, క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవడమే. 

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో సానియా మీర్జాను నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేశారు. దీనికి కారణం ఆమె పాక్ జాతీయుడు, క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవడమే.

భారత్-పాక్ మధ్య ఏ చిన్న ఉద్రిక్త చోటు చేసుకున్నా అది సానియా మీర్జాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు పుల్వామాపై ఉగ్రదాడి నేపధ్యంలో దేశం మొత్తం అమర జవాన్లకు నివాళులర్పిస్తుండగా.. అదే సమయంలో సానియా తన కొత్త డ్రెస్‌ను చూపిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది.

ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వెంటనే ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ‘‘ఒక పక్క దేశం సైనికులను కోల్పోయి విషాదంలో ఉంటే.. నువ్వు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తావా..?, ‘సానియా నీకు ఇండియా కంటే పాకిస్తాన్ అంటేనే ఇష్టం’’ అంటూ కామెంట్ చేశారు.

ఈ క్రమంలో సానియా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ముందుగా ఉగ్రవాదుల దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు సంతాపాన్ని తెలిపిన ఆమె .. ‘భారతదేశానికి ఇది చీకటి దినం అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటానని.. అలాంటి దుర్దినాన్ని మళ్లీ చూడకూడదని ప్రార్థించింది.

అలాగే సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన వారికి సైతం కౌంటరిచ్చింది. ‘‘ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్టులు పెడితేనే సెలబ్రిటీలకు దేశభక్తి ఉందని భావించే వాళ్ల కోసమే ఈ పోస్ట్.. మేం సెలబ్రిటీలను కాబట్టి.. కొందరు వ్యక్తులు మాపై విద్వేషాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు.

మేం ఉగ్రవాదానికి వ్యతిరేకమని  గొంతు చించుకుని అరవాల్సిన అవసరం మాకు లేదు.. ప్రతీ ఒక్కరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు.. లేకుంటే అదీ సమస్య. నేను నా దేశం కోసం ఆడుతాను..అందుకోసం నా చెమట చిందిస్తాను.

అలా నేను నా దేశానికి సేవ చేస్తాను.. ఉగ్రవాదుల దాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు తాను తోడుగా ఉంటా. వాళ్లు ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు.. ఫిబ్రవరీ 14 మనదేశానికి బ్లాక్ డే.. ఈ రోజును అంత సులువుగా మరచిపోలేము..

మీరు కూడా ఇంట్లో కూర్చొని సెలబ్రిటీలు ఎన్ని పోస్టులు చేశారు. ఏం పోస్ట్ చేశారో.. అని తీర్మానించడం మానేసి దేశానికి ఉపయోగపడే పని చేయండి. దేశానికి మీ వంతు సాయం అందించడం.. మేం చేస్తున్నాం.. కానీ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ కాదు అంటూ స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చింది. 
 

We stand united 🕯 pic.twitter.com/Cmeij5X1On

— Sania Mirza (@MirzaSania)
click me!