ఆట ఏదైనా, వేదిక ఎక్కడైనా.. ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం అసమానం. డెవిస్ కప్‌లో గత ఆరు ముఖాముఖి మ్యాచుల్లో పాకిస్థాన్‌పై అజేయ రికార్డు కలిగిన టీమ్ ఇండియా, తాజాగా ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకునే దిశగా గట్టి ముందడుగు వేసింది.
ఆట ఏదైనా, వేదిక ఎక్కడైనా.. ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం అసమానం. డెవిస్ కప్‌లో గత ఆరు ముఖాముఖి మ్యాచుల్లో పాకిస్థాన్‌పై అజేయ రికార్డు కలిగిన టీమ్ ఇండియా, తాజాగా ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకునే దిశగా గట్టి ముందడుగు వేసింది.
తటస్థ వేదిక నూర్ సుల్తాన్‌లో జరుగుతున్న ఆసియా ఓసియానా గ్రూప్-1 డెవిస్ కప్ మ్యాచ్ తొలి రోజు భారత్ అదిరే ఆరంభం చేసింది. ఐదు మ్యాచుల పోటీలో ప్రస్తుతం భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతోంది.
undefined
Also read: జూనియర్ టెండుల్కర్ మా అబ్బాయి కాదు... స్పష్టం చేసిన సచిన్
తొలి రెండు సింగిల్స్ మ్యాచుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. తొలి మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 42 నిమిషాల్లోనే వరుస సెట్లలో ఘన విజయం సాధించాడు. 17 ఏండ్ల పాకిస్థాన్ యువ ఆటగాడు మహ్మద్ షోయబ్ భారత స్టార్ ముందు చేతులెత్తేశాడు.
రామ్‌కుమార్ 6-0, 6-0తో షోయబ్‌పై ఎదురులేని విజయం నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో యువ ఆటగాడు సుమిత్ నాగల్ కెరీర్ తొలి డెవిస్ కప్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అబ్దుల్ రెహమాన్‌పై 6-0, 6-2తో నాగల్ ఘన విజయం అందుకున్నాడు.
' ఇంతకంటే మెరుగైన ఆరంభం ఉండదు. 2-0 ఆధిక్యం సాధించాం. దీంతో డబుల్స్ జోడీపై ఎంతో ఒత్తిడి తగ్గింది. ఈ విజయం కోసం ఆటగాళ్లు ఎంతో ఎదురుచూశారు. నేటి మ్యాచ్ కోసం ఆసక్తిగా చూస్తున్నాం' అని భారత నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ రాజ్‌పాల్ పేర్కొన్నాడు.
' భారత్‌కు ప్రాతినిథ్యం వహించటం మాటల్లో వర్ణించలేని అనుభూతి. ప్రతి భారతీయుడీ ఇదే భావన. ప్రతి పాయింట్‌కు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భావించాను. ఎంతో ఏకాగ్రతతో ఆడాను. పాకిస్థాన్ ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెడుతున్నారు, అయినా మేం వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాం. మైదానంలో పోటీపడుతున్నప్పుడు భారత అభిమానుల మద్దతు ఎల్లప్పుడూ అదనపు అనుకూలత. ఇది ఎంతో ఆత్మివిశ్వాసం అందిస్తుంది. ఏ మ్యాచ్‌లోనైనా అభిమానుల మద్దతు ఉపయోగపడుతుంది' అని రామ్‌కుమార్ రామ్‌నాథన్ పేర్కొన్నాడు.
Also read: సగం గడ్డం సగం మీసం తో కలిస్ న్యూ లుక్... ఎందుకో తెలుసా?
భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన డెవిస్ కప్ మ్యాచ్‌ను తటస్థ వేదికకు మార్చటంపై పాకి స్థాన్ రెగ్యులర్ టెన్నిస్ క్రీడాకారులు తీవ్రంగా నిరసించారు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నిర్ణయానికి నిరసనగా సీనియర్ ఆటగాళ్లు భారత్‌తో డెవిస్ కప్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు.
సీనియర్ల గైర్హాజరు డెవిస్ కప్‌లో పాకిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ. రెండు సింగిల్స్ మ్యాచుల్లోనూ పాకిస్థాన్ ప్లేయర్లు షోయబ్, రెహమాన్‌లు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. రెండు మ్యాచుల్లోనూ పాకిస్థాన్ దారుణ ఓటమి చవిచూసింది. ఈ డెవిస్ కప్ పోరులో నెగ్గిన జట్టు 2020 డెవిస్‌కప్ వరల్డ్ గ్రూప్-1 ప్లేఆఫ్స్‌లో పాల్గొంటుంది.