Australian Open 2024 : మెద్వెదేవ్‌కు షాక్.. థ్రిల్లర్ గేమ్‌లో సిన్నర్ విజయం , తొలి గ్రాండ్ స్లామ్ కైవసం

By Siva KodatiFirst Published Jan 28, 2024, 6:56 PM IST
Highlights

2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో రష్యా ఆటగాడు ప్రపంచ నెం 3 డేనియల్ మెద్వెదేవ్‌ను , ఇటాలియన్ ఆటగాడు వరల్డ్ నెం 4 జానిక్ సిన్నర్ ఓడించి సంచలనం రేపాడు. 

2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో రష్యా ఆటగాడు ప్రపంచ నెం 3 డేనియల్ మెద్వెదేవ్‌ను , ఇటాలియన్ ఆటగాడు వరల్డ్ నెం 4 జానిక్ సిన్నర్ ఓడించి సంచలనం రేపాడు.

3 గంటల 43 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో సిన్నర్ తన ప్రత్యర్ధి మెద్వెదేవ్‌ను 3-6, 3-6, 6-4, 6-4, 6-3తో 3-6, 3-6, 6-4, 6-4, 6-3 సెట్ల తేడాతో ఓడించి తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గడిచిన 13 ఏళ్లలో నోవాలక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ మినహా మరోవ్యక్తి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ఇది రెండోసారి. 2014లో స్టానిస్లాస్ వావ్రింకా టైటిల్ అందుకున్నారు. 

 

Sublime from Sinner 🥕

The Italian 🇮🇹 clinches his maiden Grand Slam title 🏆

He triumphs in five hardfought sets 3-6 3-6 6-4 6-4 6-3 to win . • • • • pic.twitter.com/DTCIqWoUoR

— #AusOpen (@AustralianOpen)

 

తొలి సెట్‌లో తొలి గేమ్‌ను కైవసం చేసుకోవడం ద్వారా సత్తా చాటిన సిన్నర్.. అక్కడి నుంచి తన దూకుడు కొనసాగించాడు. మెద్వెదేవ్ చివరి వరకు పోరాడాడు. రెండో సెట్‌లో 1-1తో డ్రా అయిన తర్వాత ఈ రష్యన్ ఆటగాడు సిన్నర్‌పై 5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ వెంటనే 6-3తో రెండు సెట్ల ఆధిక్యాన్ని అందుకున్నాడు. ఇద్దరూ వంతులవారీగా గేమ్‌లను కైవసం చేసుకోవడంతో మూడో సెట్ టగ్ ఆఫ్ వార్‌గా మారింది. మెద్వెదేవ్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. తొమ్మిదో గేమ్‌లో సిన్నర్ సెట్‌ను కైవసం చేసుకుని 6-3తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు 

click me!