ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. రెండో రౌండ్‌లోనే రఫెల్ నాదల్ అవుట్...

By Chinthakindhi Ramu  |  First Published Jan 18, 2023, 1:45 PM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 రెండో రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టిన రఫెల్ నాదల్... డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలో దిగిన స్పెయిల్ బుల్.. 


ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 ట్రోఫీలో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీలో అడుగుపెట్టిన స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్, రెండో రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. మెన్స్ సింగిల్స్‌లో అమెరికా ప్లేయర్ మెకంజీ మెక్‌డొనాల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4, 6-4, 7-5 తేడాతో వరుస సెట్లలో చిత్తుగా ఓడాడు రఫెల్ నాదల్...

మెల్‌బోర్న్‌ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ సాగుతున్న సమయంలో రఫెల్ నాదల్ గాయపడ్డాడు. అయితే గాయంతోనే మ్యాచ్‌ని కొనసాగించిన రఫెల్ నాదల్, మూడు సెట్లలో పోరాడి ఓడాడు. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన రఫెల్ నాదెల్, ఫైనల్ రౌండ్‌లో విపరీతమైన నొప్పిని భరిస్తూనే ఆడాడు...

Latest Videos

undefined

నెం.1 సీడెడ్‌గా ఆస్ట్రేలియన ఓపన్‌లో బరిలో దిగిన రఫెల్ నాదల్‌పై  అన్‌సీడెడ్ మెక్‌డొనాల్డ్‌కి ఇదే మొట్టమొదటి విజయం. 27 ఏళ్ల మెక్‌డొనాల్డ్, రెండో రౌండ్‌లో 4-3 తేడాతో వెనకబడినా ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి, సెట్ సొంతం చేసుకున్నాడు. మొదటి రెండు రౌండ్లలో దక్కిన ఆధిక్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ మూడో రౌండ్‌లో నాదల్‌పై పైచేయి సాధించాడు...

Always a pleasure, 🫶 • pic.twitter.com/CdnOMzYDK0

— #AusOpen (@AustralianOpen)

2016లో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో 45వ ర్యాంకర్‌ ఫెర్నాండో వెరస్కో చేతులో ఓడి తొలి రౌండ్ నుంచే నిష్కమించాడు రఫెల్ నాదల్. ఆ తర్వాత రఫెల్ నాదల్, ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి రెండో రౌండ్‌లోనే నిష్కమించడం ఇదే మొదటిసారి.. 

45వ ర్యాంకర్ ఫెర్నాండో చేతుల్లో ఏడేళ్ల క్రితం ఓడిన రఫెల్ నాదల్, ఈసారి ఏకంగా 65వ ర్యాంకర్ మెక్‌డొనాల్డ్ చేతుల్లో ఓడడం విశేషం. రఫెల్ నాదల్‌ని ఓడించిన అతి తక్కువ ర్యాంకు ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మెక్‌డొనాల్డ్...

కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి నిరాకరించిన కారణంగా గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోయాడు సెర్బియా టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్. 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన నొవాక్ జొకోవిచ్, రఫెల్ నాదల్ మధ్య ఫైనల్ మ్యాచ్ చూడవచ్చని ఆశించారు టెన్నిస్ ఫ్యాన్స్. అయితే రఫెల్ నాదల్ రెండో రౌండ్‌లోనే ఓడి నిష్కమించడంతో ఆ అవకాశం లేకుండాపోయింది.. 

click me!