సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది ఘాతుకం, కత్తితో ఇంట్లోకి చొరబడి

Siva Kodati |  
Published : Mar 02, 2021, 09:52 PM ISTUpdated : Mar 02, 2021, 09:53 PM IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది ఘాతుకం, కత్తితో ఇంట్లోకి చొరబడి

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. నార్సింగి పోలీస్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్‌ లక్ష్మీ నగర్ కాలనీ లోటస్ ‌హిల్స్‌లో షాలిని అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నివసిస్తోంది.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం  ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి ఆమెను కత్తితో పొడిచాడు. అనంతరం ఆ యువకుడు ఇంట్లో నుంచి పారిపోతుండగా స్థానికులు అతన్ని పట్టుకొని నార్సింగి పోలీసులకు అప్పగించారు.

అనంతరం బాధితురాలిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!