హనుమకొండలో పెళ్లి చేసుకోమంటూ కానిస్టేబుల్ వేధింపులు.. యువతి బలి...

By SumaBala BUkka  |  First Published Apr 20, 2022, 7:52 AM IST

తనకు పరిచయం అయిన యువతి మీద కానిస్టేబుల్ వేధింపులకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేస్తూ.. ఫోన్లలో సతాయించేవాడు. అవి భరించలేని యువతి ఆత్మహత్య చేసుకుంది. 


హనుమకొండ : Constable వేధింపులు తాళలేక యువతి suicideకు పాల్పడిన ఘటన hanumakonda జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ లో చోటుచేసుకుంది. ఎస్సై వీరభద్ర రావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం... తహరాపూర్ కు చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ICDS పర్యవేక్షకులుగా పనిచేస్తోంది. హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సర్వేశ్ యాదవ్ ఆమెకు కొద్ది నెలల కిందట పరిచయమయ్యాడు. ఆ పరిచయం వన్ సైడ్ లవ్ గా మారింది. దీంతో సంగీతను వేధించడం మొదలుపెట్టాడు.

పెళ్లి చేసుకోవాలంటూ సంగీతకు అతను తరచూ ఫోన్ చేసి వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రోజు వారి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సంగీత.. తన గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి.. తన సోదరికి తెలియజేసింది. వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి  తరలిస్తుండగా మృతి చెందింది.  మృతురాలి తండ్రి  వీరయ్య  ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేశామని తెలిపారు.

Latest Videos

ఇదిలా ఉండగా, ఈ జనవరిలో సిద్దిపేటలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. siddipetలో ఓ constable దారుణానికి తెగబడ్డాడు. మూడేళ్లు ప్రేమిస్తున్నాని వెంటపడి, వేధించి.. చివరికి లోబరుచుకుని.. తీరా పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. దీంతో విసిగిపోయిన woman వేరే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత మళ్లీ మెసేజ్ లు, ఛాటింగులతో వెంటపడ్డాడు ఆ కానిస్టేబుల్.. భర్తను వదిలేసి వస్తే.. పెళ్లి చేసుకుంటాని నమ్మబలికాడు.. తీరా ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయికి ఎవ్వరికీ తెలీకుండా తాళి కట్టి.. కొద్ది రోజులు వాడుకుని.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆ యువతి తనకు న్యాయం చేయమంటూ అతని ఇంటిముందు ధర్నాకు దిగింది...

ప్రేమించి పెళ్ల చేసుకుంటానని నమ్మ బలికిన ప్రియుడు మాట తప్పడంతో ప్రియురాలు అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూర్ మండల పరిధిలోని రామునిపట్లలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పల్లె విద్యను చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ యాసరేని సంతోష్ కుమార్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మ బలికాడు. 

మాయమాటలు చెప్పి తనను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె నిలదీయగా మొహం చాటేశాడు. ఏడాది క్రితం ఇంట్లో వారి అంగీకారం మేరకు మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత సైతం ఫోన్ లో రోజు చాటింగ్ చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటానని.. తన వెంట రమ్మని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్లిన ఆమెను కరీంనగర్ లో ఒక అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ సమయంలో ఆమెకు మంగళసూత్రం కట్టాడు. ఇప్పుడు ఆమెకు కనబడకుండా తిరుగుతున్నాడు. దీంతో న్యాయం చేసే వరకు రామునిపట్లలో సంతోష్ కుమార్ ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది విద్య. ఆమెకు మద్ధతుగా వారి కుటుంబసభ్యులు నిలిచారు. 

click me!