వంశీచంద్‌రెడ్డిపై దాడి మా దృష్టికి వచ్చింది: సీఈసీ రజత్ కుమార్

By narsimha lodeFirst Published Dec 7, 2018, 1:59 PM IST
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46 చోట్ల ఫిర్యాదులు అందాయి. 13 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సాగుతోంది

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46 చోట్ల ఫిర్యాదులు అందాయి. 13 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు సుమారు 49 శాతం ఓట్లు పోలయ్యాయని పోలింగ్ అధికారులు ప్రకటించారు.

పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదు.కానీ హైద్రాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత ఓటరు సెల్పీ దిగాడు. ఈ విషయమై సంబంధిత  ఎన్నికల అధికారికి  సీఈసీ  మెమో జారీ చేశారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతామని  అధికారులు ప్రకటించారు.  2014 ఎన్నికల్లో 69 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ దఫా పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని  అధికారులు భావిస్తున్నారు.

కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆమనగల్లులో  కాంగ్రెస్ అభ్యర్థి  వంశీచంద్‌రెడ్డిపై దాడి ఘటన తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు.

రాజకీయపార్టీలు  పరస్పరం ఫిర్యాదు చేసుకొన్న విషయాన్ని కూడ నిశితంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.  రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు 281 కంట్రోల్ యూనిట్స్‌ను ఏర్పాటు చేశారు.

అయితే ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు  ఏర్పడితే  వెంటనే పరిష్కరించనున్నట్టు చెప్పారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరించేందుకు ఇంజనీర్లు అందుబాటులో ఉన్నారని సీఈసీ రజత్ కుమార్ ప్రకటించారు. పోలింగ్ బూత్‌లలో తక్కువ వెలుతురు  వీవీప్యాట్  కోసం ఏర్పాటు చేసిందేనని ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు.
 

click me!