రేవంత్ రెడ్డికి షాక్: ఓటుకు నోటు కేసులో ఈడీ నోటీసులు

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 7:22 PM IST
Highlights

అందులో భాగంగా ఈడీ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. మరోవైపు రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని మంగళవారం ఈడీ విచారించింది. వేం నరేందర్ రెడ్డితోపాటు ఆయన తనయులు ఇద్దర్నీ ఈడీ విచారించింది. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మరోషాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోలేని రేవంత్ రెడ్డికి మరోషాక్ తగిలింది. వారంలోగా విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. 

తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన రేవంత్ రెడ్డికి కోలుకోలేని దెబ్బతీసింది ఓటుకు నోటు కేసు. ఆ కేసు ఇప్పటికీ రేవంత్ రెడ్డిని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఈడీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ రెడ్డిని మరోసారి విచారించాలని ఈడీ నిర్ణయించింది. 

అందులో భాగంగా ఈడీ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. మరోవైపు రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని మంగళవారం ఈడీ విచారించింది. వేం నరేందర్ రెడ్డితోపాటు ఆయన తనయులు ఇద్దర్నీ ఈడీ విచారించింది. 

ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ వేం నరేందర్ రెడ్డి ఆస్తుల వ్యవహారాలు,స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50లక్షల వంటి అంశాలపై కూపీ లాగారు. అలాగే నాలుగునర్న కోట్లు ఎక్కడివంటూ ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 

అంతేకాదు వేం నరేందర్ రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ఎదుట పెట్టి మరీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తోంది. మనీ ల్యాండరింగ్ వ్యవహారంపైనా ఆరా తీస్తోంది ఈడీ బృందం. ఇకపోతే ఇప్పటికే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహలను విచారించిన ఈడీ మరోమారు విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.  

ఇకపోతే ఈనెల 19న ఈడీ ఎదుట విచారణకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ విచారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

click me!