వేములవాడలో ఇండోనేషియా వాసులు...19 మందిపై కేసు: ఎస్సై రఫీక్

By Arun Kumar P  |  First Published Apr 24, 2020, 7:22 PM IST

వేములవాడలో గుర్తించిన 12మంది ఇండోనేషియా వాసులపై కేసులు నమోదు చేసినట్లు వేములవాడ ఎస్సై తెలిపారు. 


కరీంనగర్: గత నెలలో ఇండోనేషియా నుండి వేములవాడ కు వచ్చిన విదేశీయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఫీక్ ఖాన్ తెలిపారు. ఇలా  12మంది  విదేశీయులపైనే కాకుండా వారికి సహకరించిన 7గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 19మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఇప్పటికే కరోనా కేసులు బయటపడ్డాయి. డిల్లీలో జరిగిన మర్కాజ్ ప్రార్థనలకు హాజరైన వేములవాడకు చెందిన నలుగురు యువకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు జిల్లా వైద్యాదికారులు. వీరిలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ తేలడంతో అతన్ని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటలకు తరలించారు. 

Latest Videos

undefined

ఈ క్రమంలోనే ఇండోనేషియాకు చెందిన ఏడుగురు వేములవాడలో పర్యటించినట్లు వైద్యాధికారులు, పోలీసులు గుర్తించారు. కొందరు స్థానికుల సహకారంతో వారు వేములవాడలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించినట్లు గుర్తించారు. దీంతో 12మంది ఇండోనేషియా వాసులతో పాటు ఏడుగురు స్థానికులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఫీక్ వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య రాష్ట్రంలో 983కు చేరుకుంది.ఇప్పటి వరకు 291 మంది కోలుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 663 ఉన్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఇప్పటి వరకు 25 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.

  

click me!