బతుకమ్మ ఆడుతున్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ అడ్డా (వీడియో)

Published : Oct 09, 2018, 09:00 PM ISTUpdated : Oct 09, 2018, 09:01 PM IST
బతుకమ్మ ఆడుతున్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ అడ్డా (వీడియో)

సారాంశం

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా బతుకమ్మ వేడుకల కోసం అనేక ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్్రైవేట్ సంస్థలు కూడా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ బతుకమ్మ వేడకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇలా ఇవాళ శిల్పకళా వేదికలో ఇకిబాన ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  

ఈ బతుకమ్మ వేడుకల్లో అమెరికా కాన్సులేట్ అధికారిణి కేథరిన్ అడ్డాతో పాటు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. ఇకిబాన ఇంటర్నేషనల్ సభ్యులతో కలిసి కేథరిన్ అడ్డా స్వయంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా అక్కడున్న వారి ద్వారా బతుకమ్మ పండగ విశిష్టతను తెలుసుకున్నారు. 

అనంతరం కేథరిన్ మాట్లాడుతూ...ఇలా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనటం తనకు ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. తెలంగాణ సాంప్రదాయానికి ఈ పండగ అద్దం పడుతోందని...ఆడపడుచులతో పాటు ఆడి, పాడటం ఎంతో ఆహ్లాదాన్ని కల్గించిందన్నారు.

వీడియో

"

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు