జగిత్యాలలో ఘోర రోడ్డుప్రమాదం... ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం (Video)

Arun Kumar P   | Asianet News
Published : Dec 17, 2021, 12:22 PM ISTUpdated : Dec 17, 2021, 12:30 PM IST
జగిత్యాలలో ఘోర రోడ్డుప్రమాదం... ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం (Video)

సారాంశం

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో దానికింద నలిగి ఇద్దరు దుర్మరణం చెందారు. 

జగిత్యాల: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ దుర్ఘటన జగిత్యాల జిల్లా (jagitial district)లో చోటుచేసుకుంది. 

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదాని (accident)కి గురయ్యింది. ఎదురుగా వచ్చిన ఓ వాహనాన్ని తప్పించేక్రమంలో ట్రాక్టర్ అదపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ తో పాటు మరొకరు ట్రాక్టర్ కిందపడి నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. 

Video

ప్రమాదంలో (tractor accident) మృతిచెందిన ఇద్దరు మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్, సంతోష్ గా గుర్తించారు. ఈ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో  సుమారు గంట పాటు కష్టపడి ట్రాక్టర్ ను పైకిలేపారు. అయితే గానీ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు.  

read more  Hyderabad Accident: మందుబాబుల బీభత్సం... డివైడర్ పైనుండి గాల్లో పల్టీలు... మరో కారును ఢీకొన్న ఐ20

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సూరత్ , ప్రతీప్ లను కూడా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy in Assembly:మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ | Asianet News Telugu
CM Revanth Reddy Comments: ఆ వాటర్ ప్రాజెక్ట్ పై శాశ్వత సంతకం కేసీఆర్ చేశారు | Asianet News Telugu