టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితం.. ఎల్.రమణ

By ramya neerukondaFirst Published Nov 12, 2018, 4:20 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని టీటీడీపీ నేత ఎల్. రమణ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని టీటీడీపీ నేత ఎల్. రమణ అభిప్రాయపడ్డారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు. ఎన్నికల షెడ్యుల్ రాకముందే.. కేసీఆర్ రూ.వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

అధికారంలోకివచ్చి కేసీఆర్ కుటుంబం ఆస్తులను పెంచుకుందని విమర్శించారు. ఆ ఆస్తుల వివరాలన్నింటినీ.. ప్రజల ముందుకు తీసుకువస్తానని ఆయన అన్నారు. మహాకూటమిలో అసంతృప్తి నేతలను తమ పార్టీవైపు తిప్పుకుంటామని కేసీఆర్ చేసిన మాటలు సిగ్గుచేటుగా ఉన్నాయన్నారు.

మహాకూటమి గెలుపుకోసం తాను, రావుల.. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామన్నారు. తమ మహా కూటమి  అధికారంలోకి రాగానే.. ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తామన్నారు. మంగళవారం ఒకే వేదికపై మహాకూటమి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. 

click me!