ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ దిశానిర్దేశం

Published : Dec 18, 2018, 03:20 PM ISTUpdated : Dec 18, 2018, 06:10 PM IST
ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ దిశానిర్దేశం

సారాంశం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. వరుస సమావేశాలతో పార్టీనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు.


హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. వరుస సమావేశాలతో పార్టీనేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. 


డిసెంబర్ 22 నుంచి నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల ఓట్లు గల్లంతు అంశం తమ దృష్టికి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఫలితంగా పార్టీ అభ్యర్థులకు రావాల్సిన మెజార్టీలు సైతం కొంత మేరకు తగ్గాయని తెలిపారు. 

కొన్నిచోట్ల ఓటరు కార్డ్స్ ఉండి  కూడా ఓటర్లు ఓట్లు వేయలేక పోయారని బాధపడ్డ వారుకూడా ఉన్నారని తెలిపారు. అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు తో కూడిన బృందం ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఈ విషయాన్ని చర్చిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ను కలిసిన తర్వాత కమిషన్ చేపట్టబోయే  ఓటరు నమోదు పై పార్టీ శ్రేణులకు పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరపాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 22 నుండి 24 వరకు జరిగే నియోజక వర్గాల వారీ సమావేశానికి  రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. 

ఓటర్ల జాబితాను సవరించుకోవటమే ఎజెండా గా సమావేశాలు ఉండనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 6వరకు ఓటరు నమోదు లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 

అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు సంబంధించిన స్థల సేకరణ జరిగిందని నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. 

అయితే త్వరలోనే కార్యాలయాలకు సంబంధించిన భవనాల నమూనాను పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆమోదించిన తర్వాత, కార్యాలయాల నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెడతామన్నారు. జనవరి మొదటి వారం నుంచి పార్టీ కార్యాలయ నిర్మాణాలు ప్రారంభం కావాలన్న లక్ష్యంతో పనిచెయ్యాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu