తెలంగాణలో కారు జోరు, స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్

By Nagaraju TFirst Published Dec 11, 2018, 10:07 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 89 స్థానాలు, కాంగ్రెస్ 16, బీజేపీ4, ఎంఐఎం 5 ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 
 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 89 స్థానాలు, కాంగ్రెస్ 16, బీజేపీ4, ఎంఐఎం 5 ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెుదటి రౌండ్లో ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీ ఫలితాలు వెలువడుతుండటంతో హంగ్ ఏర్పడుతుందా అన్నంతగా ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతీ రౌండ్లోనూ టీఆర్ఎస్ భారీ ఆధిక్యం కనబరిచింది. స్పష్టమైన మెజారిటీ దిశగా టీఆర్ఎస్ పయనిస్తోంది. 

జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 1 స్థానం, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1, టీడీపీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 

మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ ఇండిపెండెంట్ ఒకరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ 9 స్థానాల్లోనూ కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యత కనబరుస్తుంది. ఇకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 1 స్థానంలోనే ఆధిక్యతలో ఉంది.
 
ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానంలో బీజేపీ 1 స్థానంలో ఆధిక్యతలో ఉంది. ఇకపోతే హైదరాబాద్ లో టీఆర్ఎస్ 6, బీజేపీ 4, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

మెత్తంగా చూస్తే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని చెప్పాలి. మెుదటి మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి ఫలితాలు స్పష్టమైన ఆధిక్యం దిశగా కారు పయనిస్తోందని వ్యక్తమవుతోంది.  
 

click me!