దువ్వడంలో కేసీఆర్ సక్సెస్: ఎమ్మెల్యేల సెంచరీకి అడుగు దూరంలో ..!!!

By Siva KodatiFirst Published Mar 18, 2019, 7:59 AM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను గెలుస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఫిగర్ 88 వద్దే ఆగిపోవడంతో మిగిలిన 12 స్ధానాలను పూరించడానికి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను గెలుస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఫిగర్ 88 వద్దే ఆగిపోవడంతో మిగిలిన 12 స్ధానాలను పూరించడానికి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారు.

వరుస పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దువ్వడం మొదలుపెట్టి, చివరికి అనుకున్నది సాధించారు. ఇండిపెండెంట్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులు కలుపుకుని మొత్తం 11 మంది కారెక్కేశారు.

దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 99కి చేరింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఒక స్వతంత్ర అభ్యర్ధి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన మరో అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోవడానికి క్యూకట్టారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కుతో మొదలైన ఈ వలసల సంఖ్య తాజాగా వనమా చేరికతో 8కి చేరింది.

టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరు కాక మరో ముగ్గురు హస్తం శాసనసభ్యులు కూడా గులాబీ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరైనా ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితే కేసీఆర్ ‘‘మిషన్ 100’’ పూర్తయినట్లే. 
 

click me!