మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగులు..

Published : Apr 21, 2022, 01:29 PM ISTUpdated : Apr 21, 2022, 01:39 PM IST
మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగులు..

సారాంశం

మహబూబాబాద్ జిల్లా పత్తిపాకలో దారుణ హత్య చోటుచేసుకుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు రవిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

మహబూబాబాద్ జిల్లా పత్తిపాకలో దారుణ హత్య చోటుచేసుకుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు రవిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పత్తిపాకలో రవి బైక్‌పై వెళ్తుండగా గొడ్డలితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. రవిని హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు ఈ హత్యకు కారణం అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రవి.. అనంతరం టీఆర్ఎస్‌లో చేరాడు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?