క్యాసినో కేసులో ఈడీ విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరయ్యారు. విచారణకు రావాలని రెండు రోజుల క్రితమే రమణకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్:క్యాసినో కేసులో ఈడీ విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ శుక్రవారంనాడు హజరయ్యారు. క్యాసినో కేసులో విచారణకు రావాలని రెండు రోజుల క్రిత మే రమణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం తలసాని ధర్మేంధ్ర యాదవ్, తలసాని మహేష్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారించారు.
హవాలా , ఫెమా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనే అనుమానంతో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదే కేసులో అనంతపురం జల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని ఈడీ అధికారులు నిన్న విచారించారు. ఇవాళ విచారణకు ఎల్. రమణ హాజరయ్యారు. మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దేవేందర్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
నేపాల్ లో జరిగిన బిగ్ డాడీ అడ్డాలో పేకాట ఆడినవారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టబద్దంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాలకు వెళ్లి క్యాసినో ఆడిన వారిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్ ద్వారా వీరంతా గోవాతో పాటు ఇతర దేశాల్లో క్యాసినో ఆడారని ఈడీ అధికారులు గుర్తించారు. క్యాసినో విషయంలో చెల్లింపులు హవాలా రూపంలో జరిగినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.