నేను కోమటిరెడ్డిని కలిసిన మాట నిజమే...కానీ: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published May 28, 2019, 6:44 PM IST
Highlights

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్ధానాల్లో 16 గెలుస్తామన్న ధీమాతో వున్న ఆ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. ఊహించని రీతిలో కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే టీఆర్ఎస్ గెలుపొందగా మిగతా చోట్ల కాంగ్రెస్, బిజెపిలు గెలిచి తమ సత్తా చాటాయి. అయితే అధికార పార్టీ ఎంపీ అభ్యర్థుల ఓటమికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ ను ఓడించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డికి సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా శేఖర్ రెడ్డి స్పందించారు. 
 
భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓడిపోతాడని తాను కలలో కూడా ఊహించలేనని శేఖర్ రెడ్డి అన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో  ఓడిపోవడం నన్నెంతో బాధించిందన్నారు. అంతకంటే ఎక్కువగా తాను టీఆర్ఎస్ ఓటమికోసం కోమటిరెడ్డి బ్రదర్స్ తో కలిసి కుట్రలు పన్నానంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి తెలిసినప్పుడు ఆవేదన చెందానని తెలిపారు. 

తాను ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినపుడు మాత్రమే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని  కలిసినట్లు వెల్లడించారు. అప్పుడు మా  మధ్య ఎలాంటి రాజకీయ సంబాషణలు జరగలేవన్నారు. కానీ దాన్ని గిట్టనివారెవరో రాజకీయం చేసి తానేదో కోమటిరెడ్డి సోదరులతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థిన ఓడించడానికి కుట్రలు పన్నినట్లు ప్రచారం చేశారన్నారు. ఈ అసత్య ప్రచారాలను ఇప్పటికీ ఖండించకుంటే అవే నిజమని ప్రజలు నమ్మే అవకాశం వుందని...అందువల్లే వివరణ ఇచ్చుకుంటున్నానని వెల్లడించారు.  

ఇదే కాకుండా మరో తప్పుడు ప్రచారం కూడా తనపై జరిగిందన్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరగిన ఫోన్ సంబాషణను తన పీఏ,  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి పీఏ ల మధ్య జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి  తప్పుడు వార్తలను సృష్టిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. భువనగిరి లోక్ షభ పరిధిలో టీఆర్ఎస్ గెలుపు కోసం ఎంత కష్టపడ్డానో తనకు, పార్టీకి, ఎంపీ అభ్యర్థికి తెలుసన్నారు. తన గురించి భువనగిరి ప్రజలకు తెలుసని...ఇలాంటి తప్పుడు ప్రచారాలను వారు  నమ్మరని శేఖర్ రెడ్డి అన్నారు.  

click me!