కాళేశ్వరంలో కనిపించని హరీశ్.. సిద్ధిపేటలో సంబురాలు (వీడియో)

By Siva KodatiFirst Published Jun 21, 2019, 1:56 PM IST
Highlights

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాంతంలో హరీశ్ కాళేశ్వరం సంబురాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావు శుక్రవారం జాతికి అంకితం చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఆయన అధికారులను పరుగులు పెట్టించి పనులు పూర్తి చేయించారు.

అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాంతంలో హరీశ్ కాళేశ్వరం సంబురాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ ప్రజలకు శుభదినమన్నారు... జయశంకర్ సార్ వర్ధంతి రోజు కాళేశ్వరం ప్రారంభించడం ఆనందంగా వుందని హరీశ్ తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని పెండింగ్ ప్రాజెక్టులుగా మారాయని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా.. పెండింగ్ ప్రాజెక్ట్‌లు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయాన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో తాను భాగమవ్వడం పూర్వజన్మ సుకృతమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ 20 ప్రాజెక్ట్‌ల సమాహారమని.. 100 మీటలర్ నుంచి 620 మీటలర్ ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసే ప్రాజెక్ట్ ప్రపంచంలో మరోటి లేదని హరీశ్ తెలిపారు. 30 ఏళ్లు పట్టే ప్రాజెక్ట్‌ను మూడేళ్లలోనే పూర్తి చేసుకున్నామని సెంట్రల్ వాటర్ కమిషన్ ఛైర్మన్ ఈ ప్రాజెక్ట్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని హరీశ్ గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర వివాదాలుగా మార్చారని.. అయితే కేసీఆర్ మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని చేసుకోవడం దేశానికే దిశానిర్దేశమన్నారు.

నేతలు, ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితోనే కాళేశ్వరం సాకారమైందని హరీశ్ పేర్కొన్నారు. పట్టుదల వుంటే దశాబ్ధాలు పట్టే ప్రాజెక్ట్‌ని వేగంగా నిర్మించవచ్చని కాళేశ్వరం ద్వారా దేశానికి ఒక సంకేతాన్ని అందించామని ఆయన తెలిపారు.

ఇన్నేళ్లు సముద్రంలో కలిసే నీటిని మన పంటపొలాల్లోకి మళ్లీంచుకుంటున్నామని.. దసరా నాటికి సిద్ధిపేటకు సాగునీరు అందుతుందని హరీశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

"

click me!