పతంగి ఎగరేస్తూ టీఆర్ఎస్ నేత మృతి... భవనం పై నుంచి కింద ఊచలమీద పడి.. (వీడియో)

Published : Jan 15, 2021, 10:16 AM IST
పతంగి ఎగరేస్తూ టీఆర్ఎస్ నేత మృతి... భవనం పై నుంచి కింద ఊచలమీద పడి.. (వీడియో)

సారాంశం

పతంగి సరదా ఓ టీఆర్ఎస్ నేత ప్రాణాన్ని నిలువుగా తీసేసింది. పతంగులు ఎగరేస్తూ చూసుకోకుండా బిల్డింగ్ అంచులదాకా వెళ్లి.. చూసుకోకుండా భవనంమీదినుండి కిందపడిపోయి మృత్యవాత పడ్డ విషాద ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది. 

"

ముషీరాబాద్ టీఆర్ఎస్ నేత బంగారు కృష్ణ పతంగినే చూస్తూ ముందుకెళ్లి.. ప్రమాదవశాత్తు భవనం పై నుంచి నేరుగా ఇంటి గేట్ ఊచలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోగానే అప్పటికే ఆయన మరణించారు.

గురువారం కుటుం సభ్యులు, మిత్రులతో కలిసి ఓ భవనంపై గాలిపటాలు ఎగురవేశారు బంగారు కృష్ణ. పతంగి జోరులో ముందూ వెనకా చూసుకోలేదు. ఊచలు అతని శరీరంలోకి దిగిపోయి రక్తం వరదలు పారడం చూసే ప్రతి ఒక్కరికీ గగుర్పాటును కలిగించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే