కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై అనర్హత వేటు: స్పీకర్‌కు ఫిర్యాదు

By narsimha lodeFirst Published Dec 13, 2018, 8:20 PM IST
Highlights

చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌కు ఇవ్వాలని  టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. 


హైదరాబాద్: చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌కు ఇవ్వాలని  టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. ఇటీవల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్‌లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్పీకర్ కు కూడ రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని కూడ ఆయన ప్రకటించారు.

అయితే గురువారం నాడు ప్రగతి భవన్‌లో జరిగిన  టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని  కోరుతూ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని  ఈ సమావేశంలో  నిర్ణయం తీసుకొన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ముస్లింలు,  గిరిజనులకు రిజర్వేషన్ల విషయమై  పార్లమెంట్‌లో  మరోసారి టీఆర్ఎస్ ప్రస్తావించే అవకాశం ఉంది.టీఆర్ఎస్ నుండి  రాజ్యసభ ఎంపీగా ఉన్న డి.శ్రీనివాస్ విషయమై చర్చించారు.2019 జనవరి తర్వాత పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.


 

click me!