కొడుక్కి కేసీఆర్ పేరుపెట్టుకున్న అభిమాని

Published : Dec 27, 2018, 11:11 AM IST
కొడుక్కి కేసీఆర్ పేరుపెట్టుకున్న అభిమాని

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అభిమానంతో ఓ కార్యకర్త తన కుమారుడికి కేసీఆర్ అని నామకరణం చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అభిమానంతో ఓ కార్యకర్త తన కుమారుడికి కేసీఆర్ అని నామకరణం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం గుర్లపల్లికి చెందిన తుప్పలి మల్లప్ప.. కొన్ని సంవత్సరాలుగా  టీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేస్తున్నాడు. ఆయన కేసీఆర్ కి వీరాభిమాని.

ఈ అభిమానంతోనే తన మూడు నెలల కుమారుడికి ఇటీవల కేసీఆర్ అని నామకరణం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం గుర్లపల్లికి వెళ్లారు.  అక్కడ టీఆర్‌ఎస్ కార్యకర్త ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ చిన్నారిని ఎత్తుకున్నారు.

కేసీఆర్ పేరు కొడుకుకి పెట్టినందుకు మల్లప్పను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అపర భగీరథుడు అయినటువంటి కేసీఆర్‌కు అభిమానులు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు. ఒక అభిమాని తన కుమారుడికి కేసీఆర్ అనే పేరు పెట్టుకోవడం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ