ఒక్క బైక్ మీద 135 చలానాలు...తప్పించుకు తిరుగువాడు ధన్యుడేమి కాదు

By sivanagaprasad KodatiFirst Published Nov 2, 2018, 12:15 PM IST
Highlights

ఫ్రెండ్స్‌తోనో.. లేదంటే కుటుంబసభ్యులతోనో బైక్ మీదనో, కారు మీదనో రోడ్డుపై వెళుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడమో.. సీటు బెల్ట్ పెట్టుకోవడమో మరిచిపోతారు... అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతుంటారు.

ఫ్రెండ్స్‌తోనో.. లేదంటే కుటుంబసభ్యులతోనో బైక్ మీదనో, కారు మీదనో రోడ్డుపై వెళుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడమో.. సీటు బెల్ట్ పెట్టుకోవడమో మరిచిపోతారు... అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతుంటారు. ఇలాంటి వారు మనల్ని ఎవరు చూస్తారులే అని నిబంధనలు క్రాస్ చేస్తూ ఉంటారు.

అయితే ఇలాంటి వారు ఒకసారి ‘‘ఈ-చలాన్’’ను చెక్ చేసుకోండి. మీ వాహనంపై ఎన్ని చలానాలు జారీ అయ్యాయో చూసుకోండి. అలా చూసుకోకుండా వెళ్లిన ఓ వ్యక్తికి పోలీసులు షాకిచ్చారు. నారాయణగూడ ట్రాఫిక్ పీఎస్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న కష్ణంరాజు గురువారం సాయంత్రం విధి నిర్వహణలో భాగంగా హిమాయత్‌నగర్ వై జంక్షన్‌లో సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో ఓల్డ్ అల్వాల్‌కు చెందిన కృష్ణప్రకాశ్ హెల్మెట్ లేకుండా బైకుకు వెళుతుండగా పట్టుకున్నారు. పెండింగ్ చలానాలు ఏమైనా ఉన్నాయేమోనని తెలుసుకోవడానికి ‘‘పీడీఏ మిషన్‌’’లో బండి నెంబర్ టైప్ చేశారు. ఆ వెంటనే మిషన్ నుంచి వచ్చిన ప్రింట్ ఔట్ చూసి పోలీసులకు కళ్లు తిరిగాయి.

సదరు బైక్‌పై 28 నెలల్లో మొత్తం 136 సార్లు ఈ-చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం పెనాల్టీ రూ.31,590.. వీటిలో జరిమానాలు రూ.26,900 కాగా, సర్వీస్ ఛార్జి మరో రూ.4,690. 2016 జూన్ 9న తొలిసారిగా హెల్మెట్ లేకుండా సెల్‌‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడంతో రూ.1100 చలానాలు జారీ చేశారు.

మొత్తం 136 చలానాల్లో ఆరు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించినవి కాగా... 127 హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు.. మిగిలిన మూడు నో పార్కింగ్‌ ఏరియాలో బండిని పార్క్ చేసినందుకు జారీ చేశారు. దీంతో బైకును స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు...వాహనదారుడికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కౌన్సెలింగ్ సైతం ఇవ్వనున్నారు. 

click me!