తెలంగాణ కరోనా అప్ డేట్: తగ్గిన రికవరీ రేటు, పెరిగిన యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 05, 2020, 09:17 AM ISTUpdated : Nov 05, 2020, 09:22 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తగ్గిన రికవరీ రేటు, పెరిగిన యాక్టివ్ కేసులు

సారాంశం

మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 44,327 మందికి కరోనా టెస్టులు చేయగా 1539 మందికి పాజిటివ్ గా తేలినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో(మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 44,327 మందికి కరోనా టెస్టులు చేయగా 1539 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 44,84,183కి చేరగా మొత్తం కేసుల సంఖ్య 2,45,682కు చేరాయి. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో 978మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,25,664కు చేరింది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్  కేసుల సంఖ్య 18,656కు చేరింది. 

read more  తెలంగాణ కరోనా అప్ డేట్: ఆందోళనకరం...రోజురోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు

 అయితే కరోనా బారినపడ్డ వారిలో గత 24గంటల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1362కి చేరింది. కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో 0.55, దేశంలో 1,5శాతాలుగా వుండగా రికవరీ రేటు రాష్ట్రంలో 91.85, దేశంలో 92.2 శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ (హైదరాబాద్) లో అత్యధికంగా 285 కేసులు బయటపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.  కరీంనగర్ 86, ఖమ్మం 78, మేడ్చల్ 102, నల్గొండ 69, రంగారెడ్డి 123, వరంగల్ అర్బన్ 46, సూర్యాపేట 52 కేసులు బయటపడ్డాయి. మిగతాజిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వుంది. 

పూర్తి వివరాలు: 


  
 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu