తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 238 పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Jan 04, 2021, 10:41 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 238 పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో తాజాగా కరోనా కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదయ్యాయి. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24గంటల్లో(శనివారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 27,077మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 238మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,87,740కు చేరితే టెస్టుల సంఖ్య 70,18,564కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 518 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,81,083కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5,106 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,942గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1551కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.2శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.68శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో కేసులేవి బయటపడలేవు. ఇక జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 2, ఆదిలాబాద్ 3, భూపాలపల్లి 5, జనగామ 3, జగిత్యాల 5, అసిఫాబాద్ 1, మహబూబ్ నగర్ 4, మహబూబాబాద్ 3, మెదక్ 4, నాగర్ కర్నూల్ 4,  నిర్మల్ 4, నిజామాబాద్ 5,  సిరిసిల్ల 3, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 4,  ములుగు 2, పెద్దపల్లి 5, సిద్దిపేట 3, సూర్యాపేట 4, భువనగిరి 2, మంచిర్యాల 8, నల్గొండ 6 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా  60కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 15, రంగారెడ్డి 26, కొత్తగూడెం 4, కరీంనగర్ 15, ఖమ్మం 4,  సంగారెడ్డి 7, వరంగల్ అర్బన్  20కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?