తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 415 పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 31, 2020, 09:38 AM ISTUpdated : Dec 31, 2020, 09:51 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 415 పాజిటివ్ కేసులు

సారాంశం

తాజాగా తెలంగాణలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. 

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా చాలా తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో(మంగళవారం రాత్రి 9గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 43,413 మందికి టెస్టులు చేయగా 415 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,86,354కు చేరగా టెస్టుల సంఖ్య 68,82,694కు చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 316 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,78,839కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1541కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.37శాతంగా వుంది. 

ఇటీవల కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవడం, రికవరీల సంఖ్య అధికంగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5,974 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు  వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 3,823 మంది హోం లేదా సంస్థల ఐసోలేషన్ లో వున్నట్లు తెలిపారు.

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట పాజిటివ్ కేసులేవీ బయటపడలేవు. ఇక జోగులాంబ గద్వాల 2,  కామారెడ్డి 3, ఆదిలాబాద్ 6, భూపాలపల్లి 7, జనగామ 5, జగిత్యాల 6, వనపర్తి 5, అసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 5, మహబూబాబాద్ 7, మెదక్ 5, నాగర్ కర్నూల్ 6,  నిర్మల్ 3, నిజామాబాద్ 6,  సిరిసిల్ల 3, వికారాబాద్ 6, వరంగల్ రూరల్ 6,  ములుగు 5, పెద్దపల్లి 9, సిద్దిపేట 6, సూర్యాపేట 8, భువనగిరి 6, మంచిర్యాల 17, నల్గొండ 6 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 91కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 39, రంగారెడ్డి 43, కొత్తగూడెం 9, కరీంనగర్ 33, ఖమ్మం 11,  సంగారెడ్డి 16, వరంగల్ అర్బన్  31కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu