తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 805 పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 29, 2020, 09:12 AM ISTUpdated : Nov 29, 2020, 09:26 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా 805 పాజిటివ్  కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నాయి. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య ఇటీవల కాలంలో రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 46,280మందికి టెస్టులు చేయగా కేవలం 805మందికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 54,28,421కి చేరితే మొత్తం కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 948 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,57,278కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10,490 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1455కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.56శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 131కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 82, రంగారెడ్డి 58, భద్రాద్రి కొత్తగూడెం 42, కరీంనగర్ 35, ఖమ్మం 40,  సంగారెడ్డి 24, సిద్దిపేట 17, సూర్యాపేట 22, వరంగల్ అర్బన్ 27, నల్గొండ 32, మంచిర్యాల 18, జగిత్యాల 56, పెద్దపల్లి 21, సిరిసిల్ల 22, నిజామాబాద్ 15, ములుగు 15 కేసులు నమోదయ్యాయి.  ఇక నారాయణపేట జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా బయటపడలేదు. 

పూర్తి వివరాలు: 


 


 

PREV
click me!

Recommended Stories

Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu