తెలంగాణ కరోనా అప్ డేట్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ...హైదరాబాద్ తో పోటీగా

Arun Kumar P   | Asianet News
Published : Nov 26, 2020, 09:35 AM ISTUpdated : Nov 26, 2020, 09:44 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభణ...హైదరాబాద్ తో పోటీగా

సారాంశం

తెలంగాణలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నా ఇంతకాలం హైదరాబాద్  కే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు జిల్లాలకు పాకడం ఆందోళన కలిగిస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గతకొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండగా ఊరటనిస్తుండగా జిల్లాల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జిహెఎంసికి పోటీగా కేసులు బయటపడుతున్నాయి. జిహెచ్ఎంసి(హైదరాబాద్)లో గత 24గంటల్లో 164 కేసులు బయటపడగా ఖమ్మంలో 63, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53 కేసులు బయటపడ్డాయి. 

మొత్తంగా మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 41,101 మందికి టెస్టులు చేయగా 862పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 52,89,908కి చేరగా కేసుల సంఖ్య 2,66,904కు చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 961 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,54,676కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10,784 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1444కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.41 శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 164, భద్రాద్రి కొత్తగూడెం 53, ఖమ్మం 63 కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 91, రంగారెడ్డి 57,  , కరీంనగర్ 38,   సంగారెడ్డి 27, సిద్దిపేట 20, సూర్యాపేట 28, వరంగల్ అర్బన్ 33, నల్గొండ  35, మంచిర్యాల 26, జగిత్యాల 24, పెద్దపల్లి 37 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu