ఏ క్షణామైనా పిడుగు పడొచ్చు..: ఎన్నికలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

By Sumanth KanukulaFirst Published Aug 3, 2022, 4:28 PM IST
Highlights

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావును.. కొందరు కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావును.. కొందరు కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన తుమ్మల నాగేశ్వరరావు.. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు.. కార్యకర్తలు సిద్దంగా ఉండాలని చెప్పారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కార్యకర్తలకు దగ్గరగా ఉండలేకపోయానని చెప్పారు. అప్పుడు పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని చెప్పారు.  ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని.. ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టిపెట్టానని చెప్పారు. తనను ఆశీర్వదిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానని చెప్పారు. 

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉపేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కొంతమంది టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఉపేందర్ రెడ్డి వర్గంలో యాక్టివ్ అయ్యారు. అయితే తుమ్మల మాత్రం పాలేరు విడిచి వెళ్లడం లేదనే సంకేతాలు పంపుతున్నారు. 

మరోసారి టీఆర్ఎస్ తరఫున పాలేరు నుంచి బరిలో దిగాలని భావిస్తున్న తమ్మల నాగేశ్వరరావు.. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా సైలెంట్ అయిన తుమ్మల.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో యాక్టివ్ అయ్యారు. దీంతో అక్కడ టీఆర్ఎస్ అధిష్టానం ఇక్కడ ఎవరికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే. ఎన్నికల నాటికి అక్కడి రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న చర్చ కూడా సాగుతుంది. 

click me!